పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

21


ప్రాధాన్యము చెప్పఁబడినది. వైదికాచారగర్హణము గానరాదు సరిగదా దాని ప్రాధాన్యముగూడ నిందుఁ బ్రతిపాదితమయినది. శ్రుతిస్మృతి పురాణాగమాదుల నుండి పెక్కుశ్లోకము లిం దుధృతములయినవి. హరదత్తాచార్యుల చతుర్వేదతాత్పర్యసంగ్రహముననుండి యిందుఁ బెక్కుశ్లోకము లుదాహృతములయినవి.

ఇది ముద్రితము.

రుద్రభాష్యము :- యజుర్వేదమందలి రుద్రాధ్యాయమున కిది భాష్యమయి యుండును. నేఁ డిది గానరాకున్నది. ఇవి ముద్రితములు.

ఈ క్రింది గ్రంథము లముద్రితములు.

బసవోదాహరణము[1] - ఇది బసవేశ్వరస్తుతి రూపమయినది. సరళమయిన రచనతో హృద్యముగ నున్నది.

ఆది:

అపిచ పురాతననూతనశివగణపాదోదకపరిలసదభిషేకః;
క్షపితవిపల్లవపల్లవజంగమ లింగసమర్చననిచితవివేకః.

అంతము:

య స్సంగీతనిధి, ర్యమాహు రభవం, యే నార్చితం సూనృతం,
యస్మై స్వస్తి, యత స్తదీయ ముదభూ, ద్యద్వీరశైవవ్రతమ్;
యస్యాపాంగసహోదరీ చ కరుణా, యస్మిన్ మహత్త్వాదికం
స త్వం త్రీణి జగంతి పాహి బసవామాత్యేశ చూడామణే !

నమస్కారగద్యము - ఆది :

శ్లో. శ్రీకంఠోద్భవవేదచోదితలసద్వీరవ్రత ప్రక్రియా
    చారాదేశకదేశికాయ భువనస్తుత్యాయ సత్యాయ చ;
    ....................................................................................
    సాక్షాచ్చ్రీవృషభాధిపాంశ బసవాధీశాయ తస్మై నమః
    అపిచ శ్రీ ప్రమథేంద్రాయ నమో
    వ్యపగత...... ...................................................

  1. 19వ పుటలోని 1వ పాద సూచికను చూడగలరు