పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

245

నూర కిట్లనుచుట యుచితమే నీకు - నారంగఁ బ్రమథులయాన నీయాన
వృషభవాహన విన్నవించుట వినక - వృషభంబు నీకెట్లు విడువంగ వచ్చు
నొల్లనొండేమియు నోటంబుగాదు - వల్లభ[1] యడుగను వరమిఁక నిన్ను
బరమపరానంద పరవశీభూత - నిరవధితత్త్వవిస్ఫురణ పెంపునకు
గతిమనోవాక్కాయ కర్మచైతన్య - రతులు నీయంద [2]విశ్రాంతంబు నొంద
జేయుము నీయాజ్ఞఁజేసి యేతెంచి - చేయంగఁగల పనుల్సేసితి నింక”
ననుడు దయామతి నగ్గురుమూర్తి - తన తొంటి భావంబుదాల్చి యక్షణమ
సంగయదేవుఁడు సదనాంతరంబు - భంగిగా వెడలుడు బసవయ్యసూచి
సన్నుత తద్గురు చరణాబ్దయుగము - [3]నెన్నుదు రిఱియంగ నన్నుతిమ్రొక్కి
యానందబాష్ప సమంచితవార్ధి - తా నిట్టవొడువ గద్గదకంఠ మమర
ముత్పులకలు మేన మొగినిండ హర్ష - తత్పరుఁడైయున్నఁ దనయు లే నెత్తి
చక్కన తనదు ప్రసాదంబువెట్టి - యక్కున నందంద యప్పళింపుచును
గొడుకు లోపలఁజేర్చికొని గురుమూర్తి - గుడిసొచ్చె నిరువురఁబొడగానరాదు
పసగొని సకలభక్త సమూహిసూడ - బసవయ్య గురువుగర్భంబుసొచ్చుటకు
సంగయదేవుండు సద్గురుభాతి - భంగిగా నేతెంచి బసవయ్యనిట్టు
తనయందు సంధించికొనుటకు నంత - ఘనతరలీల జంగమకోటి యలర
నరుదగులింగ తూర్యంబులు మ్రోయ - ధరఁ బుష్పవృష్టిదాఁబరిగొని కురియఁ
గోయని భక్తనికాయమెల్లెడల - గేయని బలుమాఱుఁ గీర్తనసేయ
జయజయారవములు సందడింపంగఁ - గ్రియఁగొని వినుకులుఁగేళికల్దనర
మాదిరాజయ్యయు మాచిదేవుండు - నాదిగాఁ గలభక్తులనురాగలీల
గలవె యుత్పత్తిస్థితిలయప్రపంచ - ములు బసవయ్యకుఁ దలఁచిచూడంగ
గాలిలోపల సురగాలినాఁబుట్టి - గాలిలోనన వెండిఁగలసియట్లు
శరనిధిఁగడలునా జనియించి వెండి - శరనిధిలోనన సమసిన యట్లు
నుడువీథియందు విద్యుల్లతవుట్టి - యుడువీథియందుఁ దా నడఁగినయట్లు
జలములయందు వర్షాఫలంబమరి - జలములలోనన సమసినయట్లు
సద్గురుకారుణ్య సంగతిఁబుట్టి - సద్గురుకారుణ్య సంపదఁదనరి
సద్గురుగర్బవిశ్రాంతిమై నిపుడు - తద్గతుఁడై లింగ తత్త్వంబుఁ బొందె
నట్టిదకాదె గుర్వంఘ్రియుగంబు - ముట్టఁగఁ గొల్చినయట్టి భక్తాలి
హృదయాంబుజంబుల నీ బసవయ్య - కదలక పువ్వును గంపునుబోలె
నలి నున్నవాఁడుగా కిలవేఱుగలదె - మలహరుభక్తులఁగలకాల మెల్ల

  1. నాకు నీ వరమడ్గఁదడవ
  2. రతిమతుల్ నీయందశ్రమమునఁబొంద
  3. చెన్నొందగదిసీసము