పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

బసవపురాణము

బుడుకఁడు భవులంచుఁబోయి పొందీఁడు - నడుగఁడు భక్తుఁడ ననుచు నింకేల
వెదపద న్సెడకుండ విత్తులు సేన - వెదవెట్టుఁగాకేమి యిది సూతఁడనుచు
నలిగి విత్తులగాదియలఁజిచ్చువెట్టి - యలరుచు ద్రోహు లంతంత వీక్షింప
నేలేశుకేతయ్య యెఱిఁగి నవ్వుచును - గాలుఁగా కేమని గ్రక్కున నచటి
నీరు [1]పొణ్కలనిండ నించి తెప్పించి - యారకుండఁగఁజేన నంతటఁగలయ
విత్తించికొని కొండ్రవేలకు మిగుల - నత్తఱిఁ బండించె ననురాగలీల
మును హీళ్లహాళ బ్రహ్మన నాఁగ భువిని - వినఁ జెప్పఁజిత్రంబు విత్తు లల్కకయ
చేను వండించె నాఁజెప్పఁగఁబరగుఁ - దా నేఁడు వీరిచేఁగానఁగఁబడియె
మదనారిభక్తుల మహిమ దలంప - నిది సోద్యమే యంచు నిల బుధు ల్వొగడఁ
బనువుచు వెండియుఁబాపిష్ఠులైన - జను లంతఁబోక యసహ్యభావమునఁ
బసు లేడ తా రేడ బగి తేడ జగతిఁ - బసరించి కుడిచెడి పగిది గా కనుచు
జంత్రంబువన్ని కచ్చఱమ్రుచ్చులకును - యంత్రించి పసులఁదారంతఁబట్టింపఁ
దలర కొక్కటియును దప్పకయుండఁ - [2]బొలమునపసులకు బొలమున వెడల
నటుగొనిపోవుచో యనుగుచునుండి - యిటప్రాణనాథుఁడుండుటఁజేసి పసులు
పండిన పొలమునఁబదువయు మొలవ - నిండినకొలఁకుల నీర్గలచోట
మఱచియైనను బులు గఱవక నీరు - దఱియుచో మూతులు దడియంగనీక
యేడునాళ్లునుగూడ నిటు సనుచుండ - చూడ నక్కజ మైనఁజోరు లూహించి
యిది యేమి చోద్యమో యిట వట్టి తెచ్చి - నది యాదిగా మేయ వంటవునీళ్లు
నుండిన ఫలమేమి రెండుమూన్నాళు - లుండినఁజచ్చు నొక్కండును మనదు
వట్టి కర్మంబేల కట్టికొనంగ - నిట్టున్న భంగిఁబోనిం డని విడువ
గ్రక్కున మగిడి యుబ్బెక్కి యంతంత - నెక్కడ నిలువక యెగసి దాఁటుచును
తోఁకలు వీపులతోఁగీలుకొలిపి - వీఁక వచ్చినదారి విడువక పట్టి
యేడునాళ్లకు మును పేతెంచు తెరువు - నేడుజాలకుఁగూడనేఁగుడు నిచట
నేలేశు కేతయ్య యెడదవ్వులందు - కీలరుఁబొడగాంచి కినియుచు దొడ్డి
పలుగాఁడి నిడి వ్రతభ్రష్టుల దిక్కు - పలుకుట సూచుట వాతకంబనుచుఁ
జొరనీక నూకుడుఁజొప్పయుఁగసువు - పరులు వాపంబంచుఁబడిగొనివైవఁ
గొప్పదిక్కున నంత సూడక వ్రతము - తప్పమయ్యా యని తా[3]రర్చునట్లు

  1. పాణంకల
  2. బొలములో పసులనుఁ బొలములోవిడిచి
  3. రార్చు