పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

239

నెలుఁగెత్తి కూడి యంబేయని [1]యఱచుఁ - దల లెత్తివంచు నాల్కలు వెడలించు
తెట్టుపై మూతులువెట్టి యన్నగరి - చుట్టును వాచర్చు శోకంబు లడర
దొడ్డిలోపలఁదారు దొల్లి భజించు - దొడ్డలింగముఁదొంగితొంగి చూచుచును
దాఁటఁగ దలపోయు [2]దర్పంబుపేర్మి - దాఁటఁగ నోడుఁ గేతయ్య రమ్మనక
యాపసు లిభ్భంగి నలమటపడఁగ - లోపలఁగట్టిన క్రేపులి ట్లెఱిఁగి
తప్పునో తమతమతల్లులు నియమ - మప్పాటనని యర్వ కాలింపకున్న
లేఁగలఁబుడుకుచు లీలఁగేతయ్య - మూఁగియర్చుచు మేఁతముట్టకుండుటయు
శీలము ల్దప్పమి వోలఁగా నెఱిఁగి - యాలోకు లత్యద్భుతాక్రాంతులుగను
బలుగాళ్లు దెఱపింప నలరుచుఁబసులు - వలివేగమున వచ్చివచ్చి యొండొండ
[3]యూఁకర ల్గొట్టుచు నుత్తలపడుచు - వీఁకఁగన్నులు విచ్చివిచ్చి చూచుచును
దలలు లింగంబుతోఁదాఁకించికొనుచు - వలగొని వచ్చుచు వడి మూరుకొనుచు
నిట లింగవిముఖులై యేఁగుటఁగోలె - నట పూరికఱ్ఱయు నంటకుండుటకు
సత్యమీ లింగంబు సాక్ష్యమన్నట్లు - నిత్యలింగస్పర్శ నియమము ల్సలిపి
గ్రక్కున కేతయ్యగారి పాదముల - కొక్కింత వంగుచు మ్రొక్కి తత్క్షణమ
ముప్పిరిగొనిపాఱి చొప్పయుఁగసువు - నప్పుడు దమ కడుపార మేయుచును
నెడనెడ నుదకంబు లేఁగి త్రావుచును - వడి నాకుచును జాఁగఁబడుచు లేచుచును
బొదుగులు సేపంగఁబొదలి నెయ్యమున - మొదవు లంబే యని మునుకొని యఱవఁ
బసులఁగేతయ్య నేపట్టుట యెఱిఁగి - పసిగొని క్రేపులు వార కర్చుచును
విడువఁదల్లులడాసి కుడువఁగ నియతి - నడరంగనఱచెఁ దా రట్ల కావునను
నేలేశు కేతయ్య యింటియీ పసులు - పాలింపఁగా శివభక్తుల యనిన
నితరులఁగలయంగ నెవ్విధిఁగూడు - మతిఁదలఁపఁగ [4]గురుమార్గమే యిదియు

సవరద నాచయ్య కథ


సవరదనాచయ్య యువిదకుఁదొల్లి - కవలవా రుదయింప గ్రక్కున మున్న
యుదయించు బాలున కొక్క లింగంబు - నుదయించు లోనన నొగి సమర్పించి
యున్న బాలునికి వేఱొక్క లింగంబు - మున్ను గల్పింపమి నన్నాతి దడసి
పతికిని వినిపింపఁబథిహీనుఁడయ్యె - సుతుఁబాఱవైపుఁడు చూడఁగరాదు
శరణోక్తి గురులింగ సన్నిహితంబు - నరయ నర్ధోదయంబైనప్డ వలయు

  1. అఱువ
  2. తప్పనుమతిని
  3. యూఁకరుల్
  4. నిదిమార్గంబు మఱియు