పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

237

కులదైవ మిలువేల్పు మలహరుఁడుండఁ - బలుద్రోవలనుబోవఁబాడియే నీకుఁ
గఱకంఠు శుద్ధనిష్కలభక్తియుక్తి - జఱభుల కదియేల సమకూడుఁజెపుమ
ముల్లోకనాథుని ముట్టఁగొల్చియును - గల్లరిలోకుల [1]క్షణియింపఁదగునె
హరునకు మజ్జనంబార్చుచేతులను - [2]సరవి విప్రులకాళ్లు సరి గడ్గఁదగునె
శివపాదజలములు శిరమునఁదాల్చి - భవుల కాళుల నీళ్లు వై నల్కఁదగునె
శ్రీమహాదేవుఁబూజించుచేతులను - నామాలకుక్కల నర్చింపఁదగునె
పురహరార్చితునకు మున్నెత్తుకలు - ధరనెత్తఁగూడునే త్రాటిమాలలకు
సదమలలింగ ప్రసాదజీవికిని - విదిత మీశ్వరభక్తి విముఖులైనట్టి
కర్మచండాలురఁగలసి కుడ్చుటయుఁ - గర్మంబు గుడుచుటగాదె యెట్లనిన
నదియును దివ్యాగమార్థంబులందు - మదనారిసద్భక్త మందిరంబులను
మెలఁగుపుత్రకళత్ర మిత్రగోత్రాది - బలఁగంబు లింగాన్వితులు గాకయున్న
నొండేమి యిలఁగూడియున్న యంతటను - చండాలమిశ్రదోషంబు వాటిల్లు
దర్శనా దపి పాపదా” యనుఁగాన - దర్శనాలాప సంస్పర్శన శయన
సంపర్కభోజనాసన దానములకు - నింపారునే భక్తుఁడితరులయెడను
బశుపతిసద్భక్తి పథ మేమిచెప్పఁ - బశువులసద్భక్తి పరులఁజేయండె

ఏలేశ్వరు కేతయ్యగారి కథ


ఖ్యాత మేలేశ్వరు కేతయ్యనా న - జాతభక్తుండు దచ్చరిత మెట్లనిన
చిత్ర మత్యద్భుత శీలప్రయుక్తి - పుత్రమిత్రకళత్రగోత్రవర్గంబు
బానిస బంటు గోపాలుండు వశువు - శ్వానంబు మఱియు మార్జాల మాదిగను
గృహచారకుల నెల్ల మహనీయలీల - మహిఁబ్రాణలింగసన్నిహితులఁజేసి
తానును భవులను దలఁపఁ డల్లంత - నైనఁజూడఁడు మాటలాడఁడు వినఁడు
ముట్టఁడు వరసీమ మెట్టఁడెయ్యెడలఁ - బెట్టఁడు వారిచేఁబెట్టించికొనఁడు
తావిల్వఁడమ్మఁడెంతయు భాగ్యమునను - బోవఁడెరవువోయి పొందిడికొనఁడు
తానయై పొరయఁడింతటి కేమి యనఁడు - మానుగా నావంతయేనిఁబోనీఁడు
భవి పరిత్యాగులై భువిఁబ్రవర్తింప - శివభక్తులకు నిది శిష్టత్వ మనఁగ
నిట్టు వర్తింప నేలేశుకేతయ్య - నెట్టణభక్తివినీతిని జనులు
నెడనెడ నొక్కొక్క యెగ్గొనరింపఁ - దొడిఁబడ కా యయ్య నడచుచునుండఁ

  1. క్షమియింపఁ
  2. నరకవిప్రుల