పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

209

“బిలిచినపని యేమి పృథివీశ” యనినఁ - గలుషంబు గ్రమ్మ బిజ్జలుఁడిట్టులనియె
“నాదిఁదలంప వర్ణాష్టాదశముల - భేదంబులవి నేఁడు వేర్కొన్నయవియె
కులసంకరము సేయఁగూడునే మాఁల[1] - గలపితి కళ్యాణకటక మంతయును
నీతలఁబుట్టెనే నిటలాక్షుభక్తి - నీతి [2]హీనుఁడ కుర్యునే వర్ష మింకఁ
బండునే యింక మీరుండినభూమి - యొండేల మీకు మే మోడుదు” మనుడు
వసుధేశ్వరునకు నవార్యవీర్యుండు - బసవఁడు సద్భక్తిపండితుండనియె
“మనుజేశ గొడ[3]గర మాచలదేవి జెనసి యుత్తమవంశఁజేసెద మనుచు
స్వర్ణధేనువులోన సతి నుంచి మునుఁగ - నిర్ణిమిత్తమ పాలు నిండఁగఁబోసి
యా పోయెఁబూర్వాశ్రయం బని తార - యాపడఁతికి మ్రొక్కి యంతటఁబోక
[4]యంగద యట్టిగ్రామాంత్యజురాలి - యెంగిలిపాల్ద్రావి [5]రేవంబు లేక
నదియేల వేయును ననఁగథ లందు - గదుగదుకేమి యక్కనకధేనువును
వండఁదర్గినమాడ్కి ఖండముల్గాఁగఁ - జెండుచుఁదమలోనఁజే వ్రేసికొనుచు
బనత సోమాదుల బలగంబుపాలు - వెనుకచట్టలు సతుర్వేదులపాలు
కోలెమ్ము దా నుపాద్దేలయ్యపాలు - వాలమ్ము బ్రహ్మవిద్వాంసులపాలు
బరులు షడంగులపాలు మున్నుడుక - లురముసైతము ప్రభాకరభట్లపాలు
సమపొట్ట సన్నపుటెముకలుఁబ్రక్క - టెముకలు వ్యాకరణమువారిపాలు
తొలఁకుజల్లియుఁద్రివేదులవారిపాలు - బలుడెక్క సిఱుడెక్క వాళ్లమిక్కిళ్లు
పరదేశి విద్యార్థిపాలంచు నిట్లు - చెరలుచు గోహత్య సేసినయూర
[6]మాలల యీ త్రాటిమాలల పచ్చి - మాలలమాటలు వోలునే వినఁగ
వేదంబు లాదియో విధికల్పితంబు - లాదియో జాతుల కది యెట్టు లనినఁ
జనువేదచోదితజాతులు రెండు - వినుము ప్రవర్తకంబును నివర్తకము
భవకర్మసంస్కారి భువిఁబ్రవర్తకుఁడు - శివకర్మసంస్కారి భువి నివర్తకుఁడు
సన్నుతవేదార్థచరితంబు లుండ - మొన్నఁ బుట్టినకులమ్ములమాట లేల
[7]స్రష్టుక్తమగునట్టిజాతులు గావె - యష్టాదశంబులు నవియేల చెప్ప
మిక్కిలి పదునెనిమిదివర్ణములకు - నిక్క మారయ భక్తనిచయంబుకులము
భాగ్యహీనుండు దాఁబసిఁడిఁబట్టిన న - యోగ్యంపులోష్టమై యున్నట్లు శివుని

  1. లు
  2. హీనకురియు
  3. వల
  4. యంగన
  5. రేహ్యంబు
  6. మాలుల(లర)
  7. స్రప్టోక్త