పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

బసవపురాణము

ప్రతిబింబమూర్తియౌ భక్తుఁడు భవికి - మతిఁజూడఁమానవాకృతి నుండు ధరణిఁ
గావున శివభక్తగణములమహిమ - భావింపఁదలఁప నీ ప్రాప్తియే చెపుమ
కరివైరితోడఁగుక్కలు వోల్ప సరియె - కరితోడ గ్రామసూకరములు సరియె
జడధితో నిలఁజౌటిపడియలు సరియె - వడి గంగతో వెడవ్రంతలు సరియె
తపనుతో ఖద్యోతతతు లెల్ల సరియె - యుపమింపఁజంద్రుతో నుడుపంక్తి సరియె
మేరువుతోఁబెఱమెట్టలు సరియె పారిజాతంబుతోఁబ్రబ్బిళ్లు సరియె
శివనాగుమయ్యతోఁజెనఁటి యీ ద్విజులు - నవనీశ సరియుఁగా రది యెట్టులనిన
భక్తుండు శ్రీపతిపండితుండీశు – భక్తుని కిలఁగోటిబ్రాహ్మణులైన
నెన యన్ననాలుక నేఁ గోసివైతు - ననుచు ననంతపాలుని సభాస్థలిని
నెక్కొనఁగాఁజండ్రనిప్పులు గాదె - చక్కన పొత్తిపచ్చడమున ముడిచె
తా నేమి చెప్ప భక్తానీక మిండ్ల - శ్వానంబులకు ద్విజు ల్సరిరామి వినవె

కల్లిదేవయ్యగారి కథ


యల్లహావినహాళ యనుపురంబునను - కల్లి దేవయ్య నాఁగా [1]మహాత్ముండు
శ్రీరుద్రు నపరావతారంబు గాని - ధారుణి మనుజావతారుండు గాఁడు
ఒకరాత్రి పరదేశి యున్న నయ్యూర - నొకవాముసంపుచు నుండు సంతతము
అప్పాటఁగల్లి దేవయ్యను గఱచి - యప్పాము దాఁజచ్చె నఖిలంబు నెఱుఁగ
కరుణాకరుఁడు గాన కల్లిదేవయ్య - యురగంబుఁబడసి యయ్యూరన యుండ
సహజసన్నుతశీల సంబంధయుక్తి - మహిమ దుల్కాడంగ మఱియొక్కనాఁడు
తమదాసి యర్ఘ్యపణ్యములకుఁబోవు - సమయంబునందొక్కసద్ద్విజుచేయి
తన్నుఁజోఁకుడు నప్డ తనతలకడువ - నన్నేలపై వ్రేసి యచ్చోన పాఁతి
యత్తఱి భసితాంగి యగుచు వేఱొక్క - క్రొత్తబిందియ మోచికొని పోవఁగాంచి
కొత్తిఁజూడుఁడు గండక్రొవ్వుఁదనంబు - నుత్తమద్విజుఁడు దా నొఱసెఁదన్ననుచు
భాండ మచ్చోటనే పాఱంగ వైచి - యొండు భాండముఁగొని యోరవోయెడిని
[2]ఎచట బ్రాహ్మణులకు నితరులముట్ట - నుచితంబు గాదుగా కొరులకు ద్విజుల
ముట్టఁగ రా దనునిట్టి ధర్మములు - పుట్టునే యని కూడి భూసురు లపుడు
కలియుగరుద్రునిఁగల్లి దేవయ్యఁ - బిలిపించి కౌటిల్యకలితవాక్యములఁ
'దలపోయ నూరిలోపల నొక్కమాట - పలు కెన్నఁడును వినఁబడదు మీ వలన

  1. మహత్తరుఁడు, మహోత్తముఁడు
  2. ఎచటనుబ్రాహ్మల కితరుల