పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

175

చెన్నొలయఁగఁగోరఁజేతఁగప్పుచును - "అన్నన్న! నన్నేటి కడిచెదు వినుము
దివి [1]నల్లవోయెడు దేవదేవేశు - కవనుండి యయ్యుమాకాంత యేతెంచె[2]
యురుజటాజూటభాస్వరుకడ నుండి - చిరమణిమకుటభాస్వర యేఁగుదెంచె
తగఁజంద్రరేఖావతంసుని నిల్పి - సుగుణావతంస దత్సుదతి యేతెంచె
ముక్కంటి వాని సమ్ముఖమున నుండి - యిక్కంటితో నొక్కయింతి యేతెంచె
కరమొప్ప నీలకంధరుకడనుండి - సరసరఁగంబుకంధర యేఁగుదెంచె
ఘనచందనాంకువక్షఃస్థలిఁబాసి - స్తనచందనాంకవక్షఃస్థలి వచ్చె
ఉరగేంద్రహారుని యూరులనుండి - కామిని వరహంసగమన యేతెంచె
ముల్లోకములఱేని ముందఱ నుండి - ముల్లోకములకెల్లఁదల్లి యేతెంచె
చన్నిచ్చెఁగడుపార మన్నించి మఱియుఁ - గొన్నిపాలు పసిండికోరలోఁబిదికి
నిలిపి వచ్చిననీలగళునిపాలికిని - బొలఁతి యల్లదె చూడు వోయెడి” ననిన
నా మహీసురుఁడద్భుతాత్ముఁడై యయ్యు - మామహేశ్వరులకు మహిఁజాఁగి మ్రొక్కి
కొడుకుఁదా నఱకట నిడుకొని వచ్చి- మడఁదియుఁదాను సమ్మదలీల నుండఁ
బార్వతీస్తనపయఃపానప్రసక్తి - సర్వజ్ఞతయు వచస్సంసిద్ధి దనరి
వేవిన గుడికేఁగి వేనవేల్విధుల - భావించి పార్వతిఁబ్రస్తుతించుడును
అంబిక స్వర్ణతాళంబు లొసంగ - దుంబురునారదాదుల మీఱి పాడఁ
గరమర్థితోడ శ్రీకాళినాథుండు - విరచితంబై యొప్పు వెలిగొ[3]డుగులును
నక్షయనిధియు ముత్యాలపందిరియు - నీక్షితిఁబ్రతిలేని హేమాసనంబు
ఖండేందుధరుఁడప్డు గరుణింపఁగనక - దండె యందల మెక్కి తా వైభవమున
భాతిగా ధారలు పరమతధూమ - కేతువు నాఁగఁబ్రఖ్యాతమై మ్రోయ
నురుతరలీలఁగులోత్తుంగచోడ - ధరణీశు శివభక్తిపరులఁ గావించి
యలరుచు సుగతసహస్రద్వయంబు - గొలువఁగఁ జను బౌద్ధగురుఁ బాఱఁద్రోలి
లీలమై మఱి రెండువేల బౌద్ధులను - బాలించి శివభక్తిపరులఁగావించి
తిరుమరక్కడయను పురిని బ్రహ్మేశు - చిరకవాటములు సుస్థితిఁదెఱపించి
తిరు[4]నావలూరు నాఁబరగునప్పురికి - నరుదెంచి జైనులనందు జయించి
యిల సర్పదష్టుఁడై యీ ల్గినయట్టి - [5]వెలమనిప్రాణముల్ వేగంబె పడసి
మధురేశుదేవి సమ్మతమునఁజేసి - మధురకేతెంచుడు మనుజేశుకడకు

  1. నదేపోయెడు
  2. యేతెంచి (తర్వాతఁగూడ క్త్వార్థకములేయున్నవి)
  3. యేతెంచి (తర్వాతఁగూడ క్త్వార్థకములేయున్నవి)
  4. పాళనాయనా
  5. వెలువ