పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

బసవపురాణము

జైనులు బౌద్ధులు సనుదెంచి యపుడు - "జ్ఞానసంబంధినాఁగా నొక్కశిశువు
నాతతవేదబాహ్యసమయధూమ - కేతుండు నాఁగ్రొవ్వి యేతెంచినాఁడు
పురి వెడలింపుము నరనాథయనిన - "గురుఁడటే యచ్చోడనరపతి కతఁడు
నూరక వెడలిం[1]చుటుచితంబుగాదు - వారి నోడింపుఁడే వాదుననైన”
ననుడు జైనులు పదునెనిమిదివేలు చని [2] యెట్లుఁదర్కింపఁ జాలక నిలిచి
నర్ధరాత్రంబప్పు డతఁడున్నయింట – స్పర్ధమైంజిచ్చిడ జ్వలనుండు వెఱచి
యెదుర నిల్వఁగఁబడ్డ “నేమేమిరోరి! - సదనంబు గాల్పనా చనుదెంచి తీవు
విహ్వలుఁగావించి వీరభద్రుండు - జిహ్వలు నీరెండు సేతులుఁదొల్లి
కోసివైవఁగ నున్నకొఱఁత నీముక్కు - గోసివైపించి యేఁగొన మఱిఁగెదవు
జైనుల గీనుల శక్తిసూచెదము - దీనఁదప్పేమి యీ భూనాథుమేనఁ
బ్రాపించి యుష్ణజ్వరస్వరూపమునఁ - దాపమొందింపుము దహన! కాచితిమి”
యనవుడు నతనిదేహంబునఁబొంది - ఘనతరజ్వరరూపమునఁగొని కాల్ప
మంగయక్కరసి యమ్మండలేశ్వరుని - యంగన తనపతియనుమతంబునను
తా నప్డు రప్పించి జ్ఞానసంబంధి - కా నాతి సాష్టాంగయై విన్నవింప
“వారెవ్వరేఁగలరారాజు నొడలి - యీరుజఁబాపంగ నింతయు [3]వలదు
వలపల మాపాలు వామభాగంబు - బలహీను[4]లార! మీ పాలు మంత్రింపుఁ”
డంచు[5]ను భూతి మంత్రించి చల్లుడును - సంచితంబుగ మేనిసగమును బాసి
వామభాగమునన జ్వర మిన్మడింప - నామును ల్మంత్రింప నగ్గలంబైన
“నారోగ ముడుపవే శ్రీరుద్రమూర్తి - యీరుజ మాన్పవే కారుణ్యపాత్ర
నాతెవు [6]లార్పవే నల్లనైనార - యీతాప[7]మడఁపవే యీడ్యచరిత్ర
నాగదఁబాపవే యోగీంద్రవంద్య! - యీగహనజ్వర [8]మిగిరింపు తండ్రి”
యని పెక్కువిధుల మహారవం బులియ - జనపతి ప్రార్థింప జ్ఞానసంబంధి
క్రమ్మన భసితంబుఁగలయఁగఁజల్లి - ముమ్మాఱు దిగఁదుడ్చి, ముట్టినంతటను
బొఱటిపాండ్యేశుడు వొలుపారమున్ను - పొఱడువోయినవీపు పొఱడుమానుటయు
భావింపఁబొంకయ్యెఁజావకపోవు - నా వీఁపు పొఱడని యాడుమాటయును
గూనిపాండ్యండను హీనత్వ ముడిగి - తా నొప్పె నంత సుందరపాండ్యుఁడనఁగ
రెట్టించి దాపటఁదొట్టినజ్వరము - చట్టన నుడుగుడు సతియును దాను

  1. పను
  2. యెను
  3. వలయు
  4. రాల
  5. దిర్నీరు
  6. ల్మాన్పవేఁ
  7. ముడుపవే
  8. మెడలింపు