పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

బసవపురాణము

ఇరుత్తాండి కథ

యోరి! చెల్లత్తిరువాలూర మఱియు - మారారిభక్తుఁడు మహినిరుత్తాండి
యనఁగ నొక్కయ్య జాత్యంధుఁడై యుండి - మనసిజహరునకు మజ్జనార్థముగ
గుడిముందఱను నొక్క గొలను గావింపఁ - గడఁగి కుద్దాలంబుఁగంపయుఁగొనుచుఁ
ద్రవ్వుచు నొకశంకుదరి నొకశంకుఁ - ద్రెవ్వనిత్రాట సంధించి చేపట్టి
మ్రోఁకువెంటన యెడతాఁకుచుఁజుట్టి - ప్రోఁకగాఁబోయుచుఁబ్రొద్దులు వుచ్చ
జినసమయులు "దీనిఁ జెరుపుదఁ[1]" డనుచుఁ - గనుఁగొని పెక్కువిఘ్నములుగావింపఁ
[2]దలఁక కెప్పటియట్లత్రవ్వుచునుండ - నిలమ్రోఁకుఁద్రెంచి శంకులు వాఱవైవఁ
గఱకంఠుచే నప్డు కన్నులు వడసి - యఱిముఱి వసదులు వెఱికి వేఁటాడి
జినసమయులనెల్లఁజీకులఁజేసి - కనఁబర్చెఁగాదె మాగణ మిరుత్తాండి

పిళ్లనైనారు కథ


మఱియు శ్రీకాళినా మహినొప్పు పురిని - నెఱిశివబ్రాహ్మణునికి నుదయించె
నలరి కుమారుని యంశంబునందు - నలువొప్పఁగాఁబిళ్ళనయనా రనంగ
జనకుఁ[3]డర్కటఁబెట్టికొని యొకనాఁడు చని సరోవరతీరమున బాలు నునిచి
తా నఘమర్షణస్నానంబు చేయఁ - గా నభోవీథిని గౌరియు శివుఁడు
మానితదివ్యవిమాననిరూఢ - యానులై చనిచని "యల్ల బాలుండు
మనకుమారునియట్ల” యనుచు నగ్గిరిజ - కనుఁగవఁజూచుడుఁజనుఁగవ సేఁప
నవనీతలంబున కరుదెంచి బాలుఁ - గవుఁగిటఁజేర్చి కూఁక[4]టి వుడుకుచును
దేవి దా శాంభవదీక్షితుఁజేసి - భావించి శివభక్తిపరునిఁగావించి
కడుపారఁజనుఁబాలు గుడిపి పసిండి - కుడుకతో వెండియుఁగొన్ని సే నిచ్చి
గౌరి దా నీశ్వరు కడ కేఁగె నంత - నీరఁ గ్రుంకిన ధరణీసురోత్తముఁడు
భోరున లేచి విస్ఫారదివ్యాంగ - చారుదీధితిఁగ్రాలు సత్పుత్రుఁగాంచి
“యోరి! చ న్నిచ్చినవా రెవ్వ రిచట - నో రెక్కడివి పైఁడికోరయుఁబాలు
నెవ్వ రేతెంచిరి యెక్కడి కేఁగి - రెవ్వల నున్న వా రిట చెప్పు” మనుచు
జన్నిదంబునను జేసాఁచి వ్రేయుడును - దిన్నని నగవును సన్నపుటేడ్పు
కన్నులఁ దొరిగెడు చిన్ని బాష్పములు - గ్రన్నన సెలవులఁగాఱుదుగ్ధములు

  1. దలర
  2. డు నొకనాఁడు దనచంకఁబెట్టి