పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

151

మృడుఁ బూజసేసి [1]వ్రేల్మిడితోడఁబసిఁడి - పడయు టరిదిగాదె పగలెల్లఁబనులు
ముక్కుఁజెమట వెండి యక్కునఁ దొరుగఁ దొరుగు - జిక్కఁజేసినను గుంచెఁడుగాని లేవు
ఇన్నియుఁజెప్పఁగనేల మాకిన్న - రన్నకుఁజెప్పు వ్ర(వ్య?)యంబును బెద్ద
ఒకమాటు రజతమహోర్వీధరంబు - నకుఁజని యేతెంచుటకు మెచ్చువచ్చె
నచ్చుగా శివుని 'నో'యనిపించె ననుచుఁ - జెచ్చరఁ దనుఁ జూడవచ్చువా[2]ర్గలరు
వ్ర(వ్య?)యమునకర్థంబు వలయునో శివుఁడు - దయపడి యిచ్చు నర్థమునకుఁదోడు
బిలిబిలికాయకంబులు సేసి పడసి - యిలఁబాఁతినర్థంబు నిసుమంత గలదు
శంకరదాసయ్యచరణము ల్గొలుచు - [3]లెంకల కెట్లును లేదనరాదు
బసవ! మీ బ్రహ్మయ కెసఁగఁగ జెప్పి - వెసఁబండ్లు వుత్తెమ్ము వేనవే లయిన
నిదె యర్ధమిచ్చెద నిటువంటి” దనుచుఁ - బదడు సేపట్టుడుఁబసిఁడియైవెలుఁగ
బసవఁడక్కజమంది ప్రణుతింపుచుండ - వెసఁగిన్నరయ్య యీ వృత్తాంత మెఱిఁగి
పఱతెంచి కలకేత బ్రహ్మయ్యగారి - [4]కెఱుకువ దులుకాడ నిలఁజాఁగి మ్రొక్కఁ[5]
గలకేత బ్రహ్మయ్య [6]యల కిన్నరయ్య - నలరుచుఁగౌఁగిట నందందచేర్చి
యతిదయామృతవార్ధి నభిషిక్తుఁజేసి - [7]నుతనిష్ప్రపంచ సన్మతికీలు సూపి
యప్రతర్క్యాదిలింగప్రాణమధన - సుప్రసన్నానుభవప్రాప్తుఁజేసి
యిరువుర లింగావసరము సేయించి - సరసోచి[8]త క్రియాసంతుష్టిఁజేసి
బసవనఁగిన్నర బ్రహ్మయ్యగారి - మసలక వీడ్కొల్పి యసమానలీలఁ
గలకేత బ్రహ్మయ్య నలిఁదొంటియట్ల - విలసితభక్తి నిశ్చలలీల నుండెఁ
గలకేత బ్రహ్మయ్య ఘనచరిత్రంబు - వెలయఁగఁజదివిన వినిన వ్రాసినను
నభవుకారుణ్యకటాక్షేక్షణమున - నభిమతఫలసిద్ధియగు నక్షణంబ

మోళిగ మారయ్య కథ


మఱియును మోళిగ మారయ్య యనఁగఁ - గఱకంఠు సద్భక్తగణ [9]విలాసంబు
ప్రచ్ఛన్నరుద్రుఁ డవిచ్ఛిన్నకీర్తి - స్వచ్ఛసదాచారసంపత్ప్రపూర్తి
విజితకామక్రోధవిమలమానసుఁడు - నిజగతి లింగైక్యనిష్ఠాపరుండు
మంగళచరితుఁడు లింగసదర్థుఁ - డంగవికారదూరైకవర్తనుఁడు

  1. వెల్మిడిలోన
  2. రలకు
  3. లెంకుల
  4. కఱుకువ... నందందమ్రొక్కి
  5. అంజలీ కృతకరకంజుఁడై నేత్ర, సంజనితానంద జలరాశిదొరుగ. ఇది యొక ప్రతిలో నధికముగా నున్నది.
  6. గార్గిన్న
  7. హితప్రాణలింగ
  8. తాలాపసంపదఁదనిపి
  9. విలాసుండు