పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

127

దివిజదానవపద్మభవహరిముఖ్యు - లవికలావరణస్థులై ప్రశంసింప
సర్వసన్మునులు నాశీర్వాదనాద - పూర్వకంబుగ హస్తములు దలఁదాల్పఁ
దుంబురునారదాదులు ప్రీతిఁబాడఁ - బంబిన దేవతూర్యంబులు సెలఁగఁ
గరికాల, సిరియాలచరితాదికథలు నరుదందఁబాఠకులంతంతఁజదువ
నటమున్న నిటలతటాక్షపదాబ్జ - ఘటితఫాలస్థల పటుదేహుఁడగుచు
జనితనేత్రానంద సలిలాభిషిక్త - వినుతవక్త్రాంబుజ విలసనుండగుచు
గద్గదప్రోద్భూత కంధరాంచిత స - ముద్గతస్తవన సంయుతదేహుఁడగుచు
సవినయ సంభ్రమ సంస్పృహానంద - వివశాంతరంగాది విభ్రముండగుచు
నున్న హలాయుధు నన్నీలగళుఁడగు - చెన్నొందఁ గౌఁగిటఁజేర్చి సంప్రీతి
నా హలాయుధునియుద్యద్భక్తిమతికి - సాహసంబునకు నసాధ్యనిష్ఠకును
మెచ్చె నచ్చెరువు నర్మిలి దొట్రుకొనఁగఁ - జెచ్చెర నతులిత శ్రీలింగమూర్తి
మెఱుఁగులఁగన్నులు మిఱుమిట్లువోవ - వఱలెఁడుకనక దివ్యవిమానపంక్తి
యవిరళంబై వెల్గ నతఁడు వాలించు - నవపురంబులు గూడ శివభక్తవితతి
నా హలాయుధుని యత్యద్భుతభక్తి - మాహాత్మ్యమలరార మహిజను ల్వొగడ
లాలితానందసల్లీల దలిర్పఁ - గైలాసమునకుఁజక్కనఁగొనిపోయె
సిరియాల దర్పాపహరణార్ధముగను - హరుఁడిల మెఱయించె నా హలాయుధునిఁ
గావున నెందును గర్వోక్తిభక్తి - భావన కెక్కునే బసవకుమార!

మిండనైనారు కథ


మఱియును సద్భక్తిమహితమండనుఁడు - మిఱుమిండనైనారు మేదురకీర్తి
జంగమారాధనా శ్రాంతనితాంత - సంగతసుఖ విగతాంగవికారి
యతులశాపానుగ్రహ[1]సమగ్రకీర్తి - యతిశయశుద్ధశివైకమానసుఁడు
దుష్టజనోద్దండదోర్దళనుండు - శిష్టజనోత్కృష్ట శీలపాలనుఁడు
ధరణిఁ [2]జేగొండనా విరచింపఁబడ్డ - పురవరంబందు సుస్థిర భక్తియుక్తి
నెలనెల శివరాత్రి నీమంబు భక్తి - వలగొని పండ్రెండువర్షము ల్సలిపి
యిచ్చమైఁబదు[3]మూఁడవేఁటి యంత్యమున - వచ్చి చెల్లంతిరువాలూరఁబరగు
వాల్మీకిదేవుని వాసంబునం ద - కల్మషభక్తి జాగరము సెల్లించి
పాపవిధ్వంసుని భక్తులుఁదాను - గోపురంబున నిష్టగోష్ఠి నున్నెడను

  1. సమర్థమూర్తి
  2. బెంగొండ
  3. మూఁటియేఁటి