పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

బసవపురాణము

మ్రొక్కి తోడ్తెచ్చి సముచితక్రియాదు - లక్కజంబుగఁజేయ నంబిక యనియె
“నఖిలంబు నెఱుగంగ నజ జనార్దనుల - ముఖమున ఱొమ్మున ముదిత లుండియును
వారక తమతమ వలచినవారిఁ - గోరి పోదురు వారి గుణమేమి సెప్పఁ
బొలుపొందఁగాఁదనపురుషునిగాని - కలనైన నెఱుఁగదు గౌరి దా నట్టి
పరమపతివ్రతాపరల మల్లయ్య - హరపాదభక్తి నిరంతరాత్మలము
'ఒడలాదిగా హలాయుధుఁడు భక్తులకు - నడిగినవస్తువు లెడపక యిచ్చు'
ననుచు సద్భక్తసభాంతరంబులను - ఘనతరంబుగఁజెప్పఁగా విని యేము
వచ్చితి మట్ల మా వాంఛితార్థంబు - లిచ్చిదీవనఁ బొందవే హలాయుధుఁడ!
మహితశివాచారమార్గానుపాల! - సహజైకలింగనిష్ఠాపరతంత్ర!
విదితసద్భక్తి సంవిత్సుఖామాత్ర! - సదమలసర్వప్రసాదైకగాత్ర!
జంగమశృంగార! సత్యగంభీర! - లింగానువర్తి! యభంగురకీర్తి!
నెట్టణ శరణుండ! నిర్మలాంగుండ! - ధట్టుండ! మోక్షవిద్యాపండితుండ!”
అంచు నగ్గింపఁగా నా హలాయుధుఁడు - సంచిత ప్రీతి [1]దుల్కాడఁ గేల్మొగిచి
“వ్యక్తిమై భక్తులవరువుడఁబ్రస్తు - తోక్తుల కోర్తునే? యొడయ లిచ్చెదరు
మా భక్తు లతులసామర్థ్యు లిట్లవిర - [2]తాభీష్టవస్తువు లడుగుఁడేమేని.”
అనవుడుఁ [3]“జిఱుతొండఘనునాతియిదియ; ననఘ! యీశ్వరునియర్ధాంగన నేను
బతి బాహ్యలైయున్న సతులేమిగొఱయు - బతు లేమిగొఱభక్తి బాహ్యులేనియును
గావునఁ దప్పులు వోవిడ్చి స్నేహ - భావన నతిదయాభావంబు దాల్చి
పతులకు నతులసద్భక్తి భిక్షంబుఁ - బ్రతిభమై మాకు సౌభాగ్యభిక్షంబుఁ
బెట్టవే?” యనుచు సంస్పృహభాతిఁగరుణ - వుట్ట నాశైలేంద్రపుత్త్రి వేఁడంగ
నటమున్న చిఱుతొండనతివయు మ్రొక్క - నిట హలాయుధుఁడును మహేశ్వరావలియు
హరునకు సెట్టికి నభయంబులొసఁగఁ - బరమాత్ముఁడజుఁడు శ్రీపార్వతీశ్వరుఁడు

శివుఁడు ప్రత్యక్షమై హలాయుధు ననుగ్రహించుట


కంతుసంహరుఁడు శ్రీకంఠుఁడుగ్రాక్షుఁ - డంతకుమున్న ప్రత్యక్షమై నిలువ
నలరుచుఁ బ్రమథరుద్రానేకకోట్లు - బలసి డగ్గఱి యిరుగెలఁకులఁ గొలువ
వెనుకదిక్కునఁదిరువెంగాణినంగ - యును సిరియాలుండు [4]దనరఁగీర్తింప
ముందఱ నందంద మ్రొక్కుచు భక్త - సందోహ మచలితానందంబు నొంద

  1. దా
  2. తాభీప్సితార్థంబు
  3. సిరియాల
  4. ననుగీర్తిసేయ