పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

బసవపురాణము

కడపుగాలంగ నాఁకటికోర్వలేక - తడవయ్యె రాడఁని తలఁచి యేడ్చదవొ?
అక్కడ దండిమృగాలిచే నాదు - చిక్కుట నూహించి నిక్కమేడ్చెదవొ?
పనిపాటుసేయనోపక యొంటివిడిచి - చనియెనో తమ పల్లెకనుచు నేడ్చెదవొ?
అఱిముఱినొక పువ్వుమఱిమూరుకొన్న - నెఱయఁబ్రాణమునకు వెఱచియేడ్చెదవొ?
కారణం బేమి? గన్గంటఁ బుట్టెండు - నీరు గాఱఁగ నేడ్వ నీకేమి వలసె?
చెప్పవేనా”కని చేర్చు గౌఁగిటను - నప్పళింపుచును 'నాయట్టి పుత్త్రుండు
గలుగ నీ కేల యప్పుల బ్రుంగ'ననిన - పొలుపునఁగంటి యప్పులు వాఱఁదుడిచి
“పాసియుఁ బాయదు వ్యాసంగ"మనుచు - నీసరి లింగముల్ నిను నరరయ్య!
[1]ఊరకోనాయన్న! [2]యూరకో తండ్రి! - [3]యూరకో నా స్వామి! [4]యూరకింతేల?
యుమ్మలికము తగ దుడుగవే” యనుచు - ఱొమ్మున నేత్రోదకమ్ములట్లొత్తు
'నెసఁగ నా ముగ్ధత కీకంటిలోని - [5]కసువ పొ'మ్మన్నట్లు గన్నుశోధించుఁ
గరతలాంగుళములఁ గనుఱెప్పలెత్తి - 'నెర సున్న'దని పాఱ[6]నిష్ఠించి యూఁదుఁ
బరగునాలుక గ్రుడ్డుపైఁ ద్రిప్పిత్రిప్పి - యెరయుచు నొరయుచు నొయ్యనఁజూచుఁ
జీరావిఁగొని కంటఁజేర్చి హత్తించి - చీరెల్లఁదడిసినఁజిక్కువెండియును
నీ కడకంట వ్రేలిడి యొత్తనొత్త - నా కడకంట ధారావలి వర్వె
నా కడకంట వ్రేలదుమ నట్లదుమ - నీ కడకంట నీరెంతయుఁ దొరిగెఁ
గొలుకులు రెండు నంగుళములనదుమఁ - గలయఁగఁగన్నెల్ల గొలుకులై కాఱె
నక్కన్నుఁగొలుకులు నరచేతమూయఁ - బక్కిళ్ళఁ బింజించి పాఱంగఁ దొడఁగె
నెట్టును నేత్రాశ్రులెడతెగకున్న - నెట్టణ దుఃఖించి బిట్టువాచఱచు
నడుగులఁబడి మ్రొక్కు నంజలియొగ్గు - నడలు నిల్చును నిల్వఁబడు లేచుఁజూచుఁ
'కటకటా!' యనుచు లింగముఁ జుట్టిచుట్టి - యటయిట యేఁగుచు నాత్మలోపలను
“నానంద బాష్పమ్ము లంద మేనియును - నాననంబునఁ దోఁప దానందచిహ్న”
సారకటాక్ష వీక్షణ జాలమైనఁ - గారుణ్య జలములు గావ యుష్ణములు
ఘర్మజలంబులక్రమ మందమేని - ఘర్మ జలంబులు గన్నులఁగలవె?
ఒండు దుఃఖం బేని యూహించి చూడ - రెండుగన్నులఁ గాఱ కుండునే నీరు?
తానొక్క గంటనె ధార వర్వెడిని - కానోపు [7]నక్షిరోగంబ యేమేని
చెప్పఁ జిత్రము! గోడిఱెప్ప వెర్గినదొ? - తప్పవోనోపునో? తడికంటివిధమొ?

  1. ఊరుకో, ఊరకు,
  2. ఊరుకో, ఊరకు,
  3. ఊరుకో, ఊరకు,
  4. ఊరుకోయేల,
  5. కసవ
  6. నిట్రించి
  7. గంట