పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

83

గన్నప్ప దేవుని ఘనముగ్ధతయును - సన్నుతభక్తియు [1]సంస్పృహత్వంబుఁ
దపసికిఁ జూపఁగఁ దలఁచి [2]శంకరుఁడు - విపరీతగతిఁద్రినేత్రపరీతమైన
వదనంబు ధరియించి వలపలికంట - నుదకంబు గాఱంగ నున్నయత్తఱిని
అరుదొందఁ దొల్లిటియట్ల కన్నప్పఁ - డరుదెంచి యరుదెంచి హరుకంటినీరు
పొడఁగని బిట్టుల్కిపడి భయభ్రాంతిఁ - దొడరుచు నరుదారఁదొల్లింటిపూజ
గ్రక్కునఁదన చెప్పుఁగాలఁ బోనూకి - పుక్కిటి నీరు[3]ను బుగులున నుమిసి
తలవంచి పత్తిరి [4]డులిచి మాంసంబుఁ - దలరుచు [5]నర్పించు తదవసరమున
నా నేత్రజల పరిహారార్థముగను - దా నీశ్వరునకు నంతర్ధారయెత్తు
భంగి జలంబులుఁ బత్తిరిబ్రుంగి - మంగళంబై యొప్పె మఱియుట్లఁగాక
తలఁగంగ నతనిపాదహతిఁ దొలంకి - [6]యలరి పాదోదకంబై వెల్లివిరియఁ
బొలుపుగఁ గన్నప్పపుక్కిటనీరు - గలయఁ ప్రసాదోదకం[7]బయి తనర
నాలింగమూర్తి యపాంగోదకముల - పోలలింగోదకపూరమై తనరఁ
ద్రివిధోదకంబులుఁ ద్రినయనుమేనఁ - బ్రవిమలంబై యిట్లు భ్రాజిల్లె నంతఁ
దవిలి ప్రసాదికిఁ ద్రివిధోదకములు - ప్రవిమలమతిఁ [8]బొందఁబాడియ[9]నంగ
సర్వాంగములుగూడ జలములు వర్వ - సర్వేశుభక్తుఁ డాశ్చర్యంబు నొంది
యగ్గలంబయ్యె నపాంగాశ్రు లనుచు - బెగ్గిలి నేత్రమ్ము దగ్గఱి చూచి
“కటకటా! యిదియేమి గర్జంపుపుట్టె - నిటలాక్ష! నీకంట నీరుగాఱెడిని
నీ నింద విని గౌరి నీఱైననాఁడు - దానించు కేనియుఁదడి [10]గంటలేదు;
జనకుచేఁ దనయునిఁ దునిమించునపుడు - కనికరంబునఁగంటఁ గ్రమ్మదు నీరు
చీర సించుచువిప్రు [11]లార(ఱ?)డివైచి - కారించుతఱి నుదకము లేదు గంట
నాఱాల వాట్లు ఱివ్వనఁ దాఁకునొవ్విఁ - గాఱవకు నాఁడును గంటఁ బాష్పములు
పరసతికై పట్టువడ్డ భంగమునఁ - దొరుగవు నాఁడును దోయముల్ గంట
వెట్టికేఁగెడు [12]తట్టఁబట్టి యెత్తుడును - నట్టిచో వెడల వపాంగోదకములు
నేఁడు నీకడకంట నిర్నిమిత్తంబ - పోఁడిగా జలములు పూరించుటేమి?
ఆలుబిడ్డలఁబాసి యడవుల గిరుల - పాలైతినని [13]దుఃఖపడి యేడిచెదవొ?
ఏకాకినైతి నింకేక్రియఁ బ్రోతు - లోకంబులని ధృతిలేక యేడ్చెదవొ?

  1. సత్ప్రియత్వంబు
  2. లింగంబు
  3. పై
  4. డులిపి
  5. నర్పింపఁదద
  6. యలరఁ బా
  7. బులై
  8. బొందుపాడి
  9. నాఁగ
  10. లేదుకంట
  11. ఇక్కడ రేఫప్రాస సాంకర్యము
  12. కట్టె
  13. చింతపడి