పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

79

దోడెఱుకులుఁ దాను దోఁపున నుండి - యాడ నొక్కింత నిద్రావస్థ దోఁపఁ
గలయఁగ రుద్ర చిహ్నలతోడ నీశుఁ - డలరుచుఁ దపసియై యరుదెంచి తన్ను
జవుకమందునిచి నొసల భూతివెట్టి - శివతీర్థకలశాభిషిక్తుఁ గావించి
“చనఁజన ముందట ఘనలింగమూర్తిఁ - గనియెదు; ప్రాణలింగంబు నీకదియు'
నని యుపదేశించినట్లు స్వప్నమునఁ - గని మేలుకాంచి నల్గడలు వీక్షింప
మును లేని దొకద్రోవ ముందటనున్నఁ - 'బొనరనిక్కలయయ్యెఁబోకల'యనుచు
దన తోడి యెఱుకుల నునిచి యొక్కండ - చనఁజన ముందట ఘనలింగమూర్తి
యున్న సంతోషించి కన్నప్పదేవుఁ - డున్నత భక్తి సంయుక్తుఁడై మ్రొక్కి
"కలగన్న చోటికి గంపఁ గొంపోవ - ఫలసిద్ధి యగుటెల్ల భాగ్యంబుగాదె?
మును దపోమూర్తి సెప్పిన లింగ మిదియ - తన ప్రాణనాథుఁడౌ” నని నిశ్చయించి
“బాస గాదింక నీ ప్రాణలింగంబుఁ - బాసి పోఁదగదు మా [1]పల్లియ కితని
గ్రక్కునఁ గొనిపోయి కట్టుదుఁ బాక - నిక్కడ నునుపరాదెండఁగాలంగ
బుద్ధులు సెప్పియు బుజ్జగించియును - దద్దయుఁగీడ్పడఁదగ వెడ్డు వెట్టి
వలసిన వస్తువు లిలఁ దెచ్చియిచ్చి - వలపించి కొని పోవవలె” నని తలఁచి
పరమహర్షమున విస్ఫా[2]రాంగుఁడగుచు - వరముగ్ధభావన హరునకిట్లనియె
 “అక్కటా!యిదియేమి హరుఁడ యొక్కరుఁడ - విక్కడనుండుట[3] యేమి గారణమొ?
తల సూప కేయూరి తమ్మళ్ళతోడ - నలగి వచ్చితి సెప్పు మలుక దీర్చెదను
గొరగ లుమ్మెత్తపత్తిరిఁ బూజసేయ - మరులెత్తి వచ్చితో యురుతరాటవికి;
[4]పరసలత్రొక్కునఁ బడఁ జాలకీవు - సిరిగిరి నుండక సురిఁగి వచ్చితివొ?
జడలకు నొడలికి సవతులువోర - నుడుపఁ జాలక వచ్చి యడవిఁ జొచ్చితివొ?
చెన్నయ్య గలసినఁ జెడెఁగులంబనుచు - నిన్ను లోకులు వెలియన్న వచ్చితివొ?
పలుమాఱు నంబికి బడిపనుల్సేయ - సొలసి వచ్చితివొ యిచ్చోట డాఁగంగ
నాఁటి బ్రహ్మయు నేఁడు నాయంబు దప్ప - వేఁటాడ వచ్చితో వేయును నేల
నా తోడి మోహంబునన నన్నుఁబ్రోవ - నేతెంచితో వేడ్క యెసఁగ నిచ్చటికి!
యెట నుం(యుం? )డి వేంచేసి తెట్లు నీ బ్రదుకు? - ఇట నుం(యుం? )డ! [5]జొచ్చి
నీవెంతగాలంబు?
ఎక్కుడుగోద నిన్నిక్కడ వైచి - యెక్కడవోయె నే నేఁగెదఁ జెపుమ?
ఒడల నర్ధము గొన్న యుమబోటి యెద్ది? - యెడరైన నవ్వరే యెక్కడివారు?

  1. పల్లెకు నితని
  2. రాంగమమర
  3. కేమి
  4. పరుస
  5. వచ్చి