పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

బసవపురాణము

కట్టిన గోచి యెక్కడ [1]నొల్వువడితి? వట్టేల వచ్చితి వడవి కొక్కఁడవ?
చంక బొక్కసమును సడలియున్నదియు - శంకింప కొంటెట్టు సరియించెదయ్య!
కొండలలోన నొక్కండ వీవిట్టు - లుండంగ వెఱవవా ఖండేందుమౌళి?
మృగములు నురగము ల్మితి మేరలేవు - నగవు గాదిచటనున్నను బ్రమాదంబు
ఎఱుకుఁ బన్నలు గన్న నేఁతురు నిన్నుఁ - గఱకంఠ! మా పల్లెఁ గలదెల్ల సుఖము
అడవుల మనుబిళ్ళ కడు మంచిపాలు - నొడిపిలి పాసెంబు నుడుప నేతులును
నిప్పపూవును దేనెలెల్ల ఫలాదు - లొప్పెడు వెదురుఁబ్రాలోగిరంబులును
మఱి యట్లుఁగాక నీ మనసు వచ్చినను - నెఱచులుఁ గఱకుట్టు లెన్నేనిఁగలవు
రావయ్య! మ్రొక్కెద దేవదేవుండ! - ప్రేవులు మాడంగఁ జావఁదప్పినదె?”
యనుచుఁ బాదాక్రాంతుఁడైన నీశ్వరుఁడు - దన తోడఁ బలుకీమి మనసులోపలను
“నింత[2]గాలము నుండి యిట గుడువండొ? - కంతునిర్దళను డాఁకటఁ బల్కలేఁడు
చెవులు సిల్లులు వోవఁ జీరంగనేల - శివునకేమేనిఁ దెచ్చెదఁ గాక”యనుచుఁ
జని కందమూలాదిశాకముల్ మృగము - లును దృష్టి మాత్రలోనన పరీక్షింప
మునుకొని “యంతకుమున్నధరిత్రిఁ - జనిన జీమూతవాహనుఁడును శిబియుఁ
గీర్తిముఖుండును గీర్తింప నాది - కర్తకు నర్పింపఁగా నెఱుంగమిని
దమ శరీరము లొండుగ్రమమున సమసి - యమిత సాహసవంతులనఁగ నిబ్బువిని
సవిశేషకీర్తిభాజను లైరిగాని - ప్రవిమలమతి లింగభాజను ల్గార”
యనుచు సౌందర్య మహాకాయులనఁగ - దనుజేశులతిఘోర తపమాచరింప
నెంతయుఁబరితోష హృదయుఁడై భర్గుఁ - డంత దైత్యులకుఁ బ్రత్యక్షమైనిలిచి
“యా యధోక్షజ కమలాసనవాస - వాయతస్వర్గ మోక్షాది భోగములు
చెచ్చెర వేఁడుఁడిచ్చెద" నని యాన - తిచ్చుడు సాష్టాంగమెఱఁగి దానవులు
“మా జలంధరుఁడభిమానంబుగొన్న - యాజనార్దనుపదమరిదియే మాకు
మా గజాసురునిచే మడిసినయట్టి - వాగీశ్వరత్వంబు వలెనె నిన్నడుగ
మా తారకునిచే విధూతమై చెడ్డ - యాతని యింద్రత్వమది యేల చెప్ప
నటుగాక వ్యాఘ్రాంధకాది దానవులు - నిటలాక్షు పగతులై నీ చేతఁదొల్లి
వడసన మోక్షంబు భక్తిమైతగిలి - పడయుట సోద్దెమే పానలొండేల
దేవ! నిత్యానంద! దివ్యలింగాంగ! - దేవ! మహాదేవ! దేవాధిదేవ!
ఎల్ల దైవత్వంబులెల్ల భోగంబు - లెల్లవి యెఱుఁగుదు మొల్ల మేమియును

  1. గోలువడితి, నొల్వఁబడితి
  2. గాలంటేని, (బేమి).