పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

బసవపురాణము

నిక్క మీశుండపో యెక్కటి [1]వీరుఁ - డొక్కఁడు నిక్కడ నున్న యప్పటికి
నూరక వట్టివిచారంబులెల్లఁ - దా రక్షయగునె సంహారరుద్రునకు”
నని నిశ్చయించి తానచ్చోన యుండి - తనయింటి [2]యావత్తుధనమును మున్ను
సంచితంబగు వస్తుసమితియుఁ జిల్ల - పెంచాదిగా [3]మట్టగించి తెప్పించి
గుడియు మంటపమును గ్రొత్త గావించి - కడునొప్పఁ జట్టు నగడ్తఁ ద్రవ్వించి
కోటయుఁ గొమ్మలుఁ గొత్తడంబులుఁ గ - వాటంబులును దగువంకదారలును
బెట్టించి [4]వంపుడుగట్ట యగడ్త - చుట్టును బోయించి యట్టళ్లు దీర్చి
పొలుపొందఁ [5]డెంకణంబులు వెక్కువన్ని - నలిఁబడగలుఁదోరణంబులు గట్టి
కొత్తడంబులఁగోటకొమ్ముల [6]గొడుగు - లెత్తించి బలుమగలెందఱో యనఁగ
[7]వ్రాలినకుసులును వసులుదూలములు - ఱాలుగుండ్లును నిస్ము సాలఁదెప్పించి
కోటకొమ్ములఁ దగుచోటఁ బంచించి - కోట యీ క్రమమునఁ బాటించి యంత
లోఁతుగా నడబావిలోనఁ గట్టించి - [8]పాఁతర్లఁ గొలుచు నేర్పడ సంగ్రహించి
యగ్గుడిచుట్టు బిల్వాశోకసురభి - గుగ్గులు క్రముకాదికుజములు వెట్టి
మరువంబు దవనంబు మాచిపత్తిరియు - వరుసను బహుపుష్పవాటికల్ నాఁటి
[9]జాలవారిని దివ్వటీలను బల్ల - గోలలవారిని గుడిపూజరులను
నొడిసెలకాండ్రను నోజులవారి - బడిపని [10]జనులను బంతంబుబంట్ల
ద్వారపాలుర సువిధానుల విండ్ల - వారిఁ దలారుల వారక యేలి
వారును దాను నవారితశక్తి - [11]గోరంతప్రొద్దు మేకొనికట్టు బిగిచి
యాయత పంచమహావాద్యరవము - పాయక రేయును బగలును మ్రోయఁ
బోటరులగు నజాంభోజనాభులకుఁ - గోట సాధింప నగోచరంబనుచు
మనుజులక్కజమంది వినుతింపుచుండ - ఘనకీర్తి నటు గొంతగాలంబు సనఁగ
ధనమెల్లఁ దన్నిమిత్తమునను సమయ - మునుకొని పరివారమునకు జీవితముఁ
బెట్టలేకున్నను [12]బెగడక జగతి - చుట్టును జాల రాచుచుఁ దిరుగుచును
అంతంతఁ గవదివియల నాఁటఁ బొడిచి - యంతఁ దొల్లిటికంటె నగ్గలికముగ
మొలనున్నగంటలు మ్రోయఁ దాళంబు - లులియ నొడ్డణము గుబ్బలు గజ్జియలును
ధ్వనియింప నల్లన తాటన వుచ్చు - చును సువిధానంబు సువిధాన మనుచుఁ

  1. ధీరుఁ
  2. యాతుర
  3. ఁబరికించి
  4. చంపుడు
  5. నంకణంబులు
  6. గొడగు
  7. వాలిన
  8. పాఁతళ్లఁ
  9. జాలదారిని
  10. వారిని
  11. గోరతప్రొద్దుమై కొనకట్టు కూడ(డి)
  12. బెగడంగ