పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

75

[1]గుడిని మానిసి గొమ్మకొమ్మ దప్పకయ - [2]యడువరిపై నున్నయట్లొక్కరుండు
వేయుముఖంబుల వేనవేల్విధులఁ - బాయక యట్టుల బలము సేయుచును
నీ విధంబున రాత్రులెల్ల వేగింపఁ- గా వెండి నూనియ గవదివియలకు
నొక్కింతయును లేకయున్న నూహించి - గ్రక్కున మాఁకుల కణికలు వేర్చి
కవదివియలభాతిఁ గాల్చుచు మంట - లవిరళంబుగఁ బెట్టి యట్లు వేగింప
నొక్కకొఱడు గొట్ర యొక [3]మ్రానుమట్ర - యొక్కబడియ బట్రయొక కట్టెగిట్టె
మందునకైనను మ్రాఁకనుపేరు - నెందును లేకుండ నేఁగుడు నంత
[4]కసువునఁబిరు(పిరి?)వెంట్లుగాఁ దాల్చిచేత - నసలారఁ గవదివియలభాతిఁ బట్టి
యిలఁ[5] దీగదీపంబుపొలుపు వట్రిల్ల - నలి మనోవేగంబున జగతిచుట్టుఁ
దిరుగుచు మఱి కొన్ని దినములు [6]నడవఁ - బొరిఁ బల్లు [7]గుట్టెడుపూరియఁ బుడుక
సదసట్ర నలి నట్ర సరి [8]గస్వుగట్ర - వెదకియుఁ గానక మది విచారించి
కచ్చడంబాదిగాఁ గలచీరె లెల్లఁ - జెచ్చెర వెంట్లుగాఁ జేసి ముట్టించి
దివి[9] వెలింగెడు మెర్గుదీగెలో నాఁగఁ - గవదివియల [10]భాతిఁ గరములఁబట్టి
వెసఁగొని తిరుగ న [11]వ్వెంట్లుఁ జెల్లుడును - మసలక చీకటి మఱువునఁజేసి
పగవారు సొత్తురో పరికింపరామి - నగుఁ బ్రమాదం [12]బంచు నాత్మలోఁదలఁచి
గ్రక్కునఁదలవెండ్రుకల జడయల్లి - చక్కన దీపంబు సంధించిపట్టి
యింతట వేగుఁబోయిం[13] కఁబ్రొద్దనుచు - నెంతయు రయమున నెప్పటియట్ల
[14]జగతిచుట్టుఁ దిరుగ జడ యెల్లఁగాలి - బగబగయనఁగ దీపదకళియారి
తలగూడ దరికొనఁ దడవ శంభుండు - జలజాక్ష జలజజ శతమఖార్చితుఁడు
కంతుసంహరుఁడంత కాంతకుఁడతిని - తాంతసదానందుఁ డంబికాధవుఁడు
త్రిభువనారాధ్యుండు దివ్యశరీరుఁ - డభవుండు శివుఁడు ప్రత్యక్షమై నిలిచి
దీరు మహోదారు దీపదకళియ - నారును గారుణ్యవారాశిఁ దేల్చి
“యిచ్చ యెయ్యది నీకు మెచ్చితి [15]వేఁడు మిచ్చెద” నావుడు నిలఁజాఁగిమ్రొక్కి
“మెచ్చులు వేయును వచ్చె నొండొల్ల - నిచ్చమై విన్నపంబేర్పడ వినుము
ఈవిపినంబులో నెక్కడి బడుగు - దేవరో యనఁగ శ్రీదివ్యలింగాంగ
లోకాశ్రితుఁడ! భక్తలోకకుటుంబి! - యేకాకివై యుండు టిది నీతిగాదు

  1. గూడ
  2. యాడుపరి
  3. మ్రాఁకు
  4. కసువు
  5. దీపగంభంబు
  6. సలిపి, సనఁగ
  7. గుట్టుకోఁబూరియుబరక
  8. గసవుగట్ర (గాండ్ర)
  9. వెలుంగు మెఱుంగు దీగయోయనఁగఁ
  10. యట్ల
  11. వ్వెట్లు
  12. బనియాత్మనూహించి
  13. యింతవ్రొ
  14. జగిలె(లి)
  15. మడుగు