పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

73

జేతికోరకు మున్ను [1]సేయిసాఁచుచును - నాతని కొదుఁగుడు నంతలోపలను
హరుఁ డోడకోడకు మనుచు నక్షణమ - వరదయామతిఁ దనవక్షంబుఁ దెఱవ
జగదభినుతకరడిగ భోగనాథు - నగణిత [2]దివ్యలింగాంగంబు సొరఁగ
నమ్మాత్రలో [3]నహహా! పోయె ననుచుఁ - గ్రమ్మనఁ దండ్రి [4]గూఁకటి వట్టుటయును
వెలుపలఁ [5]గూఁకటి వెండ్రుకల్ సిక్కె - వెలయ లింగంబులోపలఁ జిక్కెబాల
యిల నేఁడు నాఱునెలల కొక్కమాఱు - నలరి [6]కూఁకటివెండ్రుకలు [7]గత్తిరింప
'బాల నిశ్చలముగ్ధభావ సంపదకు - నీ[8]లోకమున దృష్ట' మిది యని పొగడ
గొడగూచి యని చెప్పఁబడి మహామహిమ - నడరెఁ దా నాముగ్ధ యదియునుగాక

దీపదకళియారు కథ


ఏపార మఱియుఁ గాంచీపురంబునను - దీపదకళి యన దృఢభక్తియుతుఁడు
పొరుగూరి కొక్కనాఁడరుగ నొక్కెడను - హరుఁడు జీర్ణాలయంబందుండఁజూచి
"కటకటా!యీశుఁడొక్కఁడ యున్నవాఁడు - పటుతరాటవిలోనఁ బగయును బెద్ద
కచ్చడంబులు గూడఁ గట్టించె మునులఁ - జెచ్చెర ముక్తులఁజేసె దానవులఁ
గనుమూయ నెడయులే [9]దనఁగ మువ్వెట్టి - గొనియెనవ్వాసవాద్యనిమిష వరులఁ
దిరముగా ద్వాదశాదిత్యుల నొక్క - [10]దెరువునఁ బోకుండఁదిరువుడుకొలిపె
వెలయ ననంగుఁ గావించె నంగజుని - వెలుఁగనిపురములు వెలిఁ[11]గించెఁ బేర్చి
చెనసి దామోదరుఁజేసె దామోద - రుని విధిపాలు సేసెను విధిఁబట్టి
కరుణాకరుండని గారవింపంగ - నరుదగు సర్వసంహారంబు చేసెఁ
గావునఁబగ వెద్ద దేవదేవునకు - నీ విపినంబులో నెట్లుండవచ్చు
గుడియును[12]వ్రస్సియుఁ [13]గూలిపోయినది - యడరుమంటపమును నరివియైనయది
కోటయుఁబడ్డది గూడ నయ్యైక - వాటంబు [14]లును జివ్కి వసుధఁ ద్రెళ్లినవి
ఒడల నర్ధము గొన్న యుమబోటి వుట్టు - పొడ లేదు శివునంద యడఁగెనో [15]కాక
భయమందియొంటిగోడయు[16] మీఁదఁగసువు - వయిచుకొన్నదియును వనరుచు నెదుర
మును శివుఁడిచటఁబుట్టిననాఁటనుండి - చెనసి తమ్మళి భజించిన చొప్పు లేదు
ఇది యేల వేయును నిచ్చట నునికి - యది ప్రమాదమ యసహాయంబుగాన

  1. చెయిసాఁచునట్టు-లాతనినొడ(ద)రుచు
  2. లీలదివ్యాంగంబు
  3. ననహా,
  4. కూఁకట
  5. గూఁకట
  6. కూఁకట
  7. గత్తరింప
  8. లోకులకు
  9. దనిశమ్మువెట్టి
  10. తెఱఁ(ర)గునఁ
  11. లుఁగించి పేర్చె
  12. వ్రప్పియై, వ్రస్సియై
  13. గూలుచున్నదియు
  14. లుఁజివికి
  15. కూడ
  16. తలఁగస(సు)వు.