పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

59

జిత్తరురూపమో? [1]చెలువయో పసిఁడి - పుత్తడియో” నాఁగఁ బొలఁతి యేతెంచి
ముగ్ధమిండనిపాదములమీఁదఁ బడివి - దగ్ధ [2]మిండెత సముద్యద్భక్తి మెఱసి
పడిగంబు వెట్టించి పాదముల్ గడిగి - కడువేడ్కఁ బాదోదకంబు సేవించి
ప్రీతియెలర్ప విభూతి వీడియము - లాతన్వి దాన సమర్పణ సేసి
యనుపవచ్చినవారలరుగ మిండనికిఁ - దనహస్త మిచ్చి తోడ్కొని పోవునెడను
స్ఫాటికసోపానసంక్తి నొప్పారు - హాటకకుట్టిమహర్మ్యస్థలమునఁ
గలయంగఁ గస్తూరికలయంపి [3]మీఁద - వెలుఁగు ముక్తాఫలంబుల మ్రుగ్గులమరఁ
గంభకట్లను మేలుకట్లను బొలుచు - గంభీరపుష్పకాగారంబునందు
మహితలంబితరత్నమాలికానిచయ - బహుమణిదీపవిభ్రమకాంతి వర్వ
మించి వెల్గెడుపట్టెమంచంబు పుష్ప - సంచితంబగు నండజముపాన్పు దనర
వివిధసౌరభసుఖాన్విత మగుమంద - పవనంబు జాలకపంక్తిఁ [4]దన్పార
శ్రీరుద్రవరదివ్య సింహాసనంబొ? - గౌరీమనోహరు చారుపుష్పకమొ?
గంగావతంసుని శృంగారగృహమొ? - అంగజవిజయుని యనుఁగుమంటపమొ?
అన నతిరమణీయమగు సజ్జపట్టుఁ - గని మిండఁ డద్భుతాక్రాంతాత్ముఁ డగుచు
[5]నదియును నాతి లింగార్చన సేయు - [6]సదనంబుగాఁ దన మదిలోనఁ దలఁచి
యుత్తుంగసింహాసనోపమంబైన - యత్తన్విచారు పర్యంకంబు దిగువ
నవనిపైఁ [7]గంబళి యాసనంబుగను - శివసమారాధన సేయఁ గూర్చుండి
భూతి సర్వాంగముల్ పూయుచో నతఁడు - "భూతివూయవదేవి వొలఁతి నీ”వనిన
“నిచ్చఁబార్వతి వూయు పచ్చవిభూతి - యిచ్చె నొక్కయ్య నా కీ[8]మునిమాపు
పూసితి సర్వాంగములఁ జూడు” మనుచు - భాసురంబగు మేని [9]పసుపుఁజూపుడును
వలయుచో రుద్రాక్షములు ధరింపుచును - "లలన! రుద్రాక్షముల్ దాల్పవే”మనిన
“కడుఁ గందు లవణసాగరతీరమునను - బొడమిన రుద్రాక్షములు [10]సహింపమిని
దెల్లంబు క్షీరాబ్ధితీరమందుండు - తెల్లరుద్రాక్షముల్ దెచ్చె నొక్కయ్య
యెప్పుడుఁ దాల్ప నున్ఫెక్కిన” వనుచు - నప్పొల్తి ముత్యాలహారముల్ సూప
నక్కజుండగుచు ముత్యాలసూసకము - ముక్కునఁ దాల్చిన ముత్యంబుఁ జూచి
“యుత్తమాగంబున నువిద! రుద్రాక్ష - లుత్తమంబయ్యెఁ బో క్రొత్త మాకిదియు

  1. చెలువపసిండి
  2. మిండెత అనియే వ్రాఁతప్రతులు
  3. చల్లి
  4. నింపార
  5. నదియె యానాతి
  6. సదనంబకా
  7. గంబళంబాస
  8. మును
  9. పసపు
  10. ధరింపమిని