పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

బసవపురాణము

బడియెనో యన్నట్లు భానుండు గ్రుంకెఁ- జెడిమిత్రుఁడరుగ రాజీవముల్ మొగిచె
భేరులు శంఖముల్ భోరనఁ జెలఁగె - మార[1]సంహారు నాగారాంతరముల
నలరుచుఁబంచమహా[2]శబ్దరావ - ములు మ్రోసె భక్తసమూహాలయముల
ఘనధూపధూమసంజనితమేఘములు - సెనసి కప్పినమాడ్కిఁ జీకటుల్ వర్వె
వరముక్తిసతి బసవని[3]కి నారతులు - పరువడినెత్తు దీపంబులో యనఁగ
నక్షత్రచయ మంతరిక్షంబు నిండి - యక్షీణతరకాంతి యసలార వెలిఁగె
చంద్రునిచేటు దైత్యేంద్రునిపాటు - నింద్రునిభంగంబు నెఱిఁగి యెఱింగి
గొఱియ [4]మ్రుచ్చిలి శూద్రకుండను రాజు - నఱకు వడుటతొల్లి యెఱిఁగి యెఱింగి
[5]జారులఁ జోరులఁ జర్చించుకవుల - భూరివివేకంబుఁబొగడం[6]గనేల?
యనఁగ సంధ్యావేళయందు సద్భక్త - జనులు లింగార్చనల్ [7]సలుపంగ నంత
మిండజంగమకోటి నిండారుభక్తి - దండనాయకుఁడంప దండతండములు
ఘనసారతాంబూలగంధప్రసూన - వినుతాభరణవస్త్రవితతులు గొనుచుఁ
గరమర్ధి [8]లంజెఱికంబు సేయంగ - నరిగెద మేమంచు ననురక్తి నరుగ

ముగ్ధ సంగయ్యకథ


లింగసర్వేంద్రియలీనుండు ముగ్ధ - సంగయ్య నానొక్క శరణుఁ డీక్షించి
భక్తిననుచువాఁడు బసవబండారి - వ్యక్తమిట్లేఁగెడు [9]వార్జంగమములు
కొనిపోవునవి గంధకుసుమకర్పూర - వినుత తాంబూలాదివితతులట్లయ్యుఁ
జను నిది లింగావసరవేళ [10]యున్న - పనులకు నేఁగెడు పగిది గా” దనుచు
నదియును నొక్కలింగార్చన గాఁగ - మది నిశ్చయించి సమ్మదము [11]దుల్కాడఁ
గలనైన లంజెఱికం బనునట్టి - పలు కెఱుంగమిఁ జేసి బసవయ్యఁ జూచి
“యేనును బోదునా యీయయ్యగాండ్ర - తోన లంజెఱికంబు మానుగాఁ జేయ”
ననవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁడగుచుఁ - "జనుజియ్య! నా ముగ్ధసంగయ్యదేవ!”
యని గారవింపుచు నాయయ్య కపుడుఁ - గనుఁగొన సహజశృంగారంబు సేసిఁ
పరిచారకులఁబిల్చి పటుభక్తి గల్గు - తరుణియింటికిఁ బంపఁ దత్సతిఁజూచి
“గణుతింపఁ బ్రమథలోకంబుకన్యకయొ? - గణిక సాక్షాద్రుద్రగణికయో? తలఁప

  1. సంహరు నిజమందిరంబులను
  2. వాద్య
  3. నివాసమలఁ బ
  4. మ్రుచ్చను. పెక్కు ప్రతులలో 'మ్రుచ్చను'ఉన్నది
  5. జారచోరులకథల్ నర్చించు
  6. నేమిటికి
  7. సలుపుచు నుండ
  8. 'లంజఱికము' అని వ్రాఁతలలోఁ గలదుగాని కవి “చేకూరె నిట్టిలంజెఱిక” మని ప్రయోగించెను
  9. వారుజంగములు
  10. చిన్న
  11. దొల్కాడ