పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

57

కట్టిన [1]పటవలిపుట్టంబు [2]మాకు - నిట్టున్నభంగిన యిప్పింపవలయు”
ననవుడుఁ దనసతి నాస్థానసదన - మునకుఁ బిల్వఁగఁబంచి ముద్దియఁ గదిసి
“పుట్టు సా వెఱుఁగనియట్టిమహాత్ముఁ - డిట్టలంబుగ నీదు పుట్టమడ్గెడిని
పుట్టమీ వేగ మీపుట్ట మిచ్చినను - బుట్టము మన” మనియట్టిచందమున
లజ్జయు సిగ్గు దలంపక బసవఁ - డజ్జలజాక్షి వల్వఱిముఱిఁ బట్టి
యొలువంగ నొలువంగ నొక్కవస్త్రంబు - దళితాంబుజానన మొలఁబాయకున్నఁ
గనుఁగొని యద్భుతాక్రాంతాత్ములైన - జనములఁ గనుఁగొని జంగమంబనియె
“గహనమే చూడ జగద్ధితసూత్ర - సహజవాహనులగు శంభుభక్తులకు
నలి నిడిగుడినయనారను భక్తుఁ డిల [3]నాలిచీరలొ [4]ల్బీడె భక్తులకుఁ
బండ్రెండువర్షముల్ వాయక నేని - పండ్రెండుమూరల [5]పసిఁడిపుట్టంబు
విపరీతగతిఁదన్ను [6]వేఁడుడు నొక్క - దపసికిఁ దేడరదాసయ్య యీఁడె
అదిగాక బల్లహుం డఖిలంబు నెఱుఁగ - సదమలచిత్తుఁడై సతిని మున్నీఁడె?
యఱలేక రూపించి యడుగంగఁదడవ - మఱిమొన్న యధరుండు మాణిక్య మీఁడె?
[7]దండియై మొన్న యధరుఁ డిమ్మడించి - మిండభక్తునకు నర్మిలి నర్థమీఁడె?
మహి నిడుగుడిని బెర్మాణి యన్ గణము - గహనంపుదుర్భిక్షకాలంబునందుఁ
జాటించి సకలార్థ[8]సంపదల్ సంద్ర - జూటుభక్తుల [9]కిలు చూఱవెట్టండె?
తనయపెండిలిసేయుతత్ప్రస్తవమునఁ - జనుదెంచి యొకతపోధనుఁడు వేఁడినను
నక్కాంత వెండ్రుక లప్పుడ కోసి - చక్కన మానకం [10]జారుఁ డీఁ డెట్టు?”
లనుచు గీటునఁ బుచ్చుచును మిండగీఁడు - కినియునో [11]తడవైనఁ దనవేశ్య యనుచు
బసవని వారించి వసుధఁ బ్రోవైనఁ - బసిఁడిచెఱంగుల పట్టువస్త్రములు
మోపిడి తనమోవనోపి [12]నన్నియును - నేపారఁ గొని [13]వచ్చి యిచ్చె లంజియకు
“నిక్కంబు బసవని నిజభక్తిమహిమఁ - దక్కువ [14]గాదయ్యెఁ దరుణిమానంబు”
అని భక్తమండలి వినుతింపుచుండ - వనిత యంతర్వాసమున కేఁగె నంత.

సూర్యాస్తమయ వర్ణనము


బసవనిభక్తి ప్రభాపటలంబు - దెసల వసుంధర దివి [15]దీటుకొనఁగ
దినకరుఁ డాత్మీయతేజంబు దఱుఁగు - డును మది లజ్జించి చని యపరాబ్ధిఁ

  1. పటువలి
  2. నాకు
  3. నారి
  4. ఇట్టిసంధుల నీతఁడు పెక్కుచోట్లఁ గూర్చినాడు.
  5. పట్టు
  6. వేఁడెడు, వేఁడిన
  7. వెండియు
  8. సమితియుఁ జంద్ర
  9. కిలఁజూఱ
  10. జారుండు యీఁడె
  11. తడసిన
  12. యన్ని
  13. పోయి
  14. వడదయ్యె
  15. నిట్టవొడువ