పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

బసవపురాణము

నెక్కడ వినఁబడ [1]దిట్లు రుద్రాక్ష - ముక్కునఁ [2]దాల్చిన ముఖ్యమే?”మనిన
“దేవ! యేమనిచెప్ప? దేవుఁడే యెఱుఁగు - నా విశేషంబు వేదాతీత” మనుఁడు
నురుజటావలి విచ్చి యొత్తిచుట్టుచును - "దరళాక్షి! జడలేల తాల్ప వీ” వనిన
సగముప్రసాదపుష్పములకు [3]నునిచి - [4]సగమునఁదాల్చితి సన్నంపుజడలు
సన్నుతతద్భస్మసమ్మిశ్ర మగుచు - వెన్నున [5]నిదె చూడు వ్రేలెడి” ననుచు
పటుగళాభరణసంఘటితమై యొప్పు - పటవలికుచ్చులు వడఁతి సూపుడును
“భువి నిట్టిభక్తురాలవు గచ్చడంబు - ధవళాక్షి! మఱి యేల తాల్ప వీ” వనిన
"లింగవంతులు గాని లెంగుల దృష్టి - భంగిగా నాపయిఁబాఱకయుండఁ
గట్టితి సర్వాంగకచ్చడం” బనుచుఁ - గట్టిన సమకట్టుఁగాంత సూపుడును
వనిత యపూర్వలాంఛనధారిగాఁగ - మనమునఁ దలపోసి మహిఁజాఁగిమ్రొక్కి
“యిట్టిలాంఛనమున కెవ్వ రాచార్యు? - లెట్టివి నియమంబు? లెట్టిది సపర్య?
తరుణి! మీ గురుసంప్రదాయంబు వారు - ధరణి నే ఠావునఁ దపము సేయుదురు?
సంతతంబును [6]నేరి సద్గోష్ఠి [7]నుందు - రింతయుఁజెప్పు మాకేర్పడ” ననిన
“నాగమనిగమోక్తి నవ్వామదేవ - యోగిచే శివదీక్ష యొప్పంగఁబడసి
కైలాసమునఁ దపోవేళ మెప్పించి - శూలిచేఁ బడసె మున్నీలాంఛనంబు
అది గారణముగఁ బూర్వాచార్యురాలు - సదమలాత్మక హిమశైలతనూజ
శ్రీనందనుని గెల్చి శివుని మెప్పించి - మేన నర్ధము గొన్న మెలఁతవర్గంబు;
జగములన్నియుఁ దన శక్తిఁబాలించు - జగదేకసుందరి సంతతిమేము;
శివరహస్యాది ప్రసిద్ధశాస్త్రములు - శివునిచేఁబడసిన చెలువశిష్యలము;
ఆకాంక్షతోడ జన్నావులపాలు - సేకొని యష్టావశేషంబు సేసి
చెఱకుకట్టెలపొడి సేరెఁడు సల్లి - మఱి యిష్టలింగసమర్పణ సేసి
తప్పక యీ ప్రసాదంబింతగొందు - మెప్పాటఁగలనైన నెఱుఁగమోగిరము
[8]గలిగెనే వెండియుఁ గందమూలాది - ఫలపత్త్రశాకముల్ భక్తులిచ్చినను
స్వామికర్పించి ప్రసాదంబు గొందు - మేమని చెప్పుదు [9]మీ తపశ్చరణ?
తనువును, మనమును, ధనమును విడిచి - మనికులై రసికులై, మగ్నులై గోష్ఠి
తవులంబు [10]గలిగినతజ్జంగమాను - భవమందు నెప్పుడుఁ బాయకుండుదుము.
అనఘ! త్రికాలలింగార్చన మీఁది [11]పనులు దక్కఁగ లేవు [12]బగళులు రేలు

  1. దిట్టి
  2. దాల్చుటముఖ్యమేయనిన
  3. నిలిపి
  4. సగముదాల్చితిఁగడు
  5. నివె
  6. నెట్టి
  7. నుండు
  8. గలిగిన
  9. మిది
  10. గలయట్టి
  11. పనులొండునున్నవే
  12. పగలును రేయు