పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

బసవపురాణము

యిట్టిచోద్యంబు లే మెఱుఁగ మేనాఁటఁ - బట్టి! మా కడుపునఁ బుట్టితికాక
‘ప్రాలు గల్గుసుపుత్రుఁ బడసితిమింక - మేలయ్యె’నని యేము లీల [1]నున్నెడను
బుట్టివాఁడ కులముపురులు వోనాడ - [2]నెట్టయ్య! తలఁచెదు పట్టి [3]మాయయ్య!
కులదీపకుఁడు పుట్టఁగులము వర్ధిల్లు - గులనాపకుఁడు పుట్టఁ గులమెల్ల [4]గ్రుంగుఁ
గులమునకెల్లను గుద్దలిఁగొంటి - [5]వెలిసేయరే నన్ను విప్రులు విన్న?
నిన్నుఁ జేపట్టి [6]యనీతిమై కులము - చెన్నఁటి! పోనాడి చెడనెట్లు వచ్చు?
యుక్తి సెప్పితిమిప్పు డొల్ల[7]వైతేని - భక్తియు నీవును బడ్డట్లు పడుము.”
అని నిష్ఠురోక్తుల నందంద పలుక - విని పొంగి బసవఁ డిట్లనియెఁ గోపమున
“బ్రాహ్మ్యంబు భక్తియుఁ [8]బలికెదుకూడ - బ్రాహ్మ్యంబు [9]వేఱెదర్శనమయియుండు
వేఱెదైవంబును వేఱె మంత్రంబు - వేఱె యాచార్యుండు వేఱె వేషంబు
ధ్యానంబు వేఱె బ్రాహ్మ్యక్రియల్వేఱె - మానుగా నాచార్యమార్గంబు వేఱె
కాదేని నగ్నిముఖము, బ్రహ్మశిరము, - నాదిరుద్రుడు శిఖ, హరి యుదరంబు
ప్రాణాదివాయువు ల్ప్రాణంబు, యోని - క్షోణి, దాశ్వేతంబు సూవె వర్ణంబు
నసమాక్షువిధమె గాయత్రి సాంఖ్యాయ - నసగోత్ర మిరువదినాల్గక్షరములు
దానికి మఱి త్రిపాదంబు షట్కుక్షి - పాన లొండును గావు పంచశీర్షంబు
నని చెప్పుఁగాదె మీయాజ్ఞికంబులును - వినుము దైవంబది వేఱౌనొ కాదొ?
కావున నిదియు సాంఖ్యాయనమతము - [10]దైవంబనంగలేదు తా బహురూపు
దాని కాచార్యుండు ధరఁగర్మజడుఁడు - దానికి మంత్రంబు దాను గాయత్రి
ప్రతిదినక్రియ కర్మబంధంబు వేష - మితరేతరము మోక్షహేతువే తలఁప?
నదికాక షడ్దర్శనాతీతమైన - మదనారిసద్భక్తిమార్గంబు వినుము
శ్రుతి "విశ్వతశ్చక్షుఋత” యంచుఁ బొగడు - స్తుతుల మీఱినయట్టి సూక్ష్మరూపంబు
[11]ఆదికి నాది నిత్యానందమూర్తి - శ్రీ దివ్యలింగమూర్తియ సుదైవంబు
నట్టి యీశ్వరునాత్మఁబట్టించి చేతఁ - బెట్టంగఁజాలిన పృథుదయామూర్తి
ప్రకటింప "నగురో రధిక” మనఁ బరగు - సకలస్వరూప మాసమయసద్గురుడు
మంత్రంబులకు రాజమంత్రమై వెలయు - మంత్రంబు దానికి మఱి షడక్షరియు
భవదూరమగు జటాభసితరుద్రాక్ష - సవిశేషమోక్షానుసారి వేషంబు

  1. నుండంగఁ
  2. నెట్టన్న
  3. నాయన్న!
  4. గ్రుంగు
  5. వెలితి సేయరె ని(న)న్ను
  6. యీ నీతియుఁ గులము
  7. వేనియును
  8. బదరెదు
  9. వేద
  10. దైవమన్నది
  11. “అదిగాక మహిమదా నది యేమి చెప్ప” ఈ చరణ మొక ప్రతీలో నున్నది.