పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

19

గతపూర్వజన్మసంస్కారుఁడై పిదప - వితతద్విజత్వంబు పతితంబు గాదె?
నిర్మలగురుకృపాన్వీతజన్మునకుఁ - గర్మజన్మంబు దుష్కర్మంబు గాదె?
యగ్గురుపాదంబులర్చించు నతని - కగ్గిలో హవి వేల్చుటది దప్పుగాదె?
మలహరాత్మకమగుమంత్రంబుఁ [1]గఱచి – పలుమంత్రములు [2]గొనఁబాపంబుగాదె?
శూలి భక్తులకెత్తుకేలది త్రాటి - మాలల కెత్తుట [3]మఱి తప్పుగాదె?
కర్మపాశంబులొక్కటఁదెగు నీల్గి - [4]కర్మంబుత్రాళ్లు దాఁగట్టుకోఁదగునె?
రుద్రాక్షభసితాదిముద్రలు దాల్చి - క్షుద్రముద్రలు దాల్పఁగూడునే చెపుమ?
యీ రీతిఁద్రాటికి దూరమైయున్న - వీరమాహేశ్వరాచారదీక్షితుని
నిర్మితోభయకర్మనిర్మూలు నన్నుఁ - గర్మాబ్ది ముంచుట ధర్మమే నీకుఁ?
గచ్చఱఁగన్నులఁగానవు గాక - వచ్చునే బసవని వడుగుసేయంగ
బ్రహ్మశిరోహరుఁ బ్రమథైకవంశ్యు - బ్రహ్మ[5]వంశ్యుండని భావించె[6]దెట్లు?
జాతిగోత్రాతీతు సద్గురుజాతు - జాతిగోత్రక్రియాశ్రయుఁ [7]జేసె దెట్టు?
లకులస్థుఁడై యున్న యభవుని భక్తు - నికి నేకులం బని నిర్ణయించెదవు?
కావున నెన్నిమార్గములను వడుగు - గావింపఁగా రాదు కథ [8]లేమిచెప్ప”
ననవుడుఁదండ్రియిట్లనియెఁ బుత్త్రునికి - విన[9]వయ్య! బసవయ్య! విప్ర[10]మార్గంబు
నాగమవిధిఁ బదియా(దునా?) ఱుకర్మంబు - లాగర్భసంస్కార మాదిగాఁ గలవు
వానిలో నొకఁడైన నూన మౌనేని - కానేరఁడాతఁడగ్రకులోత్తముండు
అందు విరుద్ధ మెయ్యది రుద్రగణము - [11]నాందిముఖ్యం బుపనయనపూజకును
బనుగొనఁ బ్రణవంబు భర్గుఁడే దైవ - మనుటయు మంత్రంబు నట్లును గాక
పెట్టిన సూత్రముల్ భీమసర్పములు - పట్టినపాత్రంబు బ్రహ్మశిరంబు
పాలాశదండంబు పంకజోదరుని - కోలెమ్ము దలచుట్టు [12]కూఁకటుల్ జడలు
నఱితికృష్ణాజిన మది గజాజినము - వఱలు మేధావియే నెఱిభూతి గాఁగ
హరుఁడు భిక్షాటనమాచరింపఁగ - నరిగిన వేషమింపారఁదాల్చినను
నట్టైనఁగాని బ్రాహ్మణుఁడు గాఁడనిన - నిట్టు విరుద్ధమే యీశు భక్తునకు?
వడుగుచేసిన భక్తి వట్టి పాటగునె? - నొడువరితనమునఁ గడవ నాడెదవు
[13]పసిబిడ్డమాటలు పనియు లేదింక - మసలక చేయుమీ మా చెప్పినంత

  1. దలఁచి
  2. గానఁ
  3. మాలమి(ర్మి) గాదె
  4. కర్మంపుఁద్రాళ్లు
  5. వంశజుఁ
  6. చుటె; చితె
  7. జేయుటె, జూసితె
  8. లేల
  9. వన్న! బసవన్న!
  10. మార్గమున
  11. నందిముఖం
  12. కూఁకటల్
  13. 'పసుబిడ్డ' అని యితరగ్రంథములందున్నది.