పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

బసవపురాణము


వాలేశ్వరునిది పద్యకృతి) ఇక్కడ ముద్రితమయిన పాఠమును శ. ర. పాఠమును జూచినఁ దెలియఁగలదు. తలంటునప్పుడు పసిబిడ్డలఁబండుకొనఁబెట్టుటకయి చాఁచిన యూరుద్వయమునకు దొంగిళ్ళని పేరు. 'తొంగిళ్ళపై నిడి లింగమూర్తికిని నంగన గావించు నభ్యంజనంబు' అను ద్విపదను గన్నడకృతిలో భీమకవి యిట్లు పరివర్తించినాఁడు. 'ఎరడుతొడగళమేలె పరమన | నిరిసిసలె యభ్యంగనవ నా| చరిసు' మఱియు 'అంగిటి ముత్లొత్తునందందవ్రేలఁ - దొంగిళ్ళఁ గార్నీరు దో నెత్తిమిడుచు' అనుదానికి 'అంగుళియ ముళ్ళం సుదతితం నంగుళది నొత్తువళుతుంగో త్సంగదిం సురిదంబువనితం నెత్తి యొళెరెవళు.”

శబ్దరత్నాకరకారులు మన సోమనాథుని గ్రంథములను స్వయముగాఁ దలస్పర్శముగాఁ బరిశోధించినట్టు గానరాదు. అట్లు శోధించియుందురేని బసవపురాణ, పండితారాధ్యచరిత్రములలోని ద్విపదలనే యన్యగ్రంథములలోని వానిఁగా నుద్దరించుటగాని యనేకశబ్దములను విడుచుటగాని సంభవింపదు. సోమనాథుని గ్రంథములు మొదటి తరగతిలోఁ జేరవలసినవయినను వారైదవతరగతిలోఁజేర్చిరి. ఇంతవఱకు నేఁజూపిన శబ్దములు కొన్ని శబ్దరత్నాకరమునఁ జేరనివే. నిఘంటువులలోఁ జేరనివి నూర్లకొలఁదిగా శబ్దములీ సోమనాథుని గ్రంథములలో నింకనుగలవు. ఈ బసవపురాణమున స్థూలదృష్టిని నాకు గోచరించిన వానిని గొన్నింటి నకారాద్యక్షరక్రమమునకుఁ దార్చి యిక్కడఁ జూపుచున్నాఁడను. శబ్దరత్నాకరమునకందనిశబ్దములు, అందినను దప్పు రూపముతో నున్నశబ్దములు తప్పుటీకతోనున్న శబ్దములు, సందిగ్ధరూప సందిగ్దార్థములతో నున్నశబ్దములు నిందుఁగలవు.

శబ్ద విశేషములు

పు. 46 అంకంబువాఁడు = ముద్రధారి

పు. 234 అక్కిలించు = అక్కలించు,

పు. 71 అచ్చన = అర్చన,

పు. 120 అడఁకు= ఒదుఁగు,

పు. 134 అ(?)డచాళ్లు = రాజ్యాంగోద్యోగులు,