పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

145

పు. 153 అడుకు = దాఁచు

పు. 75 అడువరి = ఆడువరి, వప్రము,

అడ్డాయుధము = ఆయుధభేదము..

పు. 162, అరసు= రాజు, 'రాజన్' శబ్దము, అఱవమున 'అరశన్' కన్నడమునను తెనుఁగునను అరసు 'దేవ-రసు నిర్ధనయ్య నిరాళదేవయ్య' పండితా. పు.3

పు. 73 అరివియగు= బయలగు, (అఱివి = శిథిలము చూ. కాశీఖండము)[1]

పు. 113 అరుచు= చెల్లించు,

పు. 146 అఱగొడైతనము = (చూ.శ.ర.) అలగొండెతనము,

పు. 68 అఱిమి = అజీర్ణవ్యాధి, అఱుకువ రూపాంతరము అఱు+ ఇమి శ.ర. అరిమి చూచునది.

పు. 220 అఱప =చేని మంచె

పు. 105, 134 అఱిముఱితనము = తొందర,

పు. 138, 139 అలుకు = చల్లు,

గీ. నెగడు పేర్బిందులనువిడినీరఁ బ్రియుఁడు |
    గరజ హలముల మైపూఁతగలయఁ గలఁచి
    కామబీజములలుక వేగమున మొలచు
    మొలకలన మేని నిండ ముత్పులక లెసఁగె.

-కుమారసం. 8 ఆశ్వా.

పొంగారెడు నేతికిఁబయిపై నీరలికినయట్లపోలె నిష్ఫలమయ్యెన్. దశకుమార చరిత్ర, 3 ఆశ్వా. 'పరువంపుఁ బుప్పొడి బాగుగాఁదీర్చిన యలకలపైఁ బొలుపార నలికి, ఎఱ్ఱన హరివంశము.

పు. 69 ఆదట = తృప్తి.

పు. 8 ఆదరికము = ఆదరము, (కిట్టెల్ కన్నడనిఘంటువు చూచునది)

  1. నిడి నీరు = వాననీరు. తిరుపతి ప్రాంతముల వాడుక ఉన్నది. శాసనములు చూ. పీఠికలో ఈ పట్టున శాస్త్రిగారీ విషయమును గుర్తించిరి ( ప్రకాశకులు)