పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

143


రూపాంతరములు గావచ్చును. [1]'పశువడు' కలదో లేదో! సోమనాథుని ప్రయోగములకు మొదటి యర్థమే పొందుచున్నది. 'పశువరింపఁగఁ జంప' - 'పశువరించుచుఁ గొర్లపాలు సేయుచును' అనుచో హింసించు బాధించు అనియే యర్థమగును.

పు. 85 విగుర్వణము. నన్నయ 'విగుర్వించు' అనియు నన్నిచోడఁడు 'గర్వవిగుర్వణంబులన్' అనియు నీ పదమును బ్రయోగించిరి. 'గుర్వీ ఉద్యమనే' అని ధాతుపాఠమునఁ బరిగణితమయిన ధాతువున నుండి పయిపదములు పుట్టినవి. గుర్వీధాతువుననుండి 'గూర్వణ' మని రూపమేర్పడునుగాని 'గుర్వణ' మని యేర్పడదు గావున నిది కర్ణాటదేశి పదమని కొందఱందురు. గుర్వు, గుర్వించు, అగుర్వు, అగుర్వించు అనునవి తద్భవరూపములగునని నేఁదలంతును. 'విగుర్వించు' 'విగుర్వణము' తత్సమములనియే నా తలఁపు. కావుననే నన్నిచోడఁడు 'గర్వవిగుర్వణంబులన్' అని సంస్కృత సమాసమునఁ జేర్చెను. గుర్వు, గుర్వించు మొదలగు తద్భవశబ్దముల సంబంధముచే 'విగూర్వించు, విగూర్వణము' అని యుండవలసిన తత్సమ శబ్దములను లేఖకులు 'విగుర్వించు, విగుర్వణము' అని లిఖించియుందురు. 'గు' ఎట్లును గురువేకాన 'గుర్వణ' మన్నను 'గూర్వణ' మన్నను బద్యములందుఁ జిక్కులేదయ్యెను. ఈ తలఁపు తోడనే నేను 'గు (గూ?) ర్వణ' మని యుంచితిని.

పు. 67 తొంగిళ్ళు - శ. ర. లో నీ పదమునకు నీటిబొట్లు, నూనెబొట్లు అని యర్థము కలదు. భల్లాణ చరిత్రలోనివిగా బసవపురాణములోని యీ ద్విపదలే యపపాఠములతో నందుద్దృతములయ్యెను. (శబ్దరత్నాకరమునఁ బెక్కు పట్టుల బసవపురాణ పండితారాధ్యచరిత్రములలోని ద్విపదలోని ద్విపదలే భల్లాణచరిత్ర ద్విపద భాగవత పతివ్రతాచరిత్రములలోనివిగా నుద్దరింపఁబడినవి. ఆయా ద్విపదలాయా గ్రంథములందు నాకుఁ గానరాలేదు. శ. ర. లో గ్రంథ సంకేత వివరణ పట్టికలో భల్లాణచరిత్రము వాలేశ్వరునిదిగాఁ జెప్పఁబడినది.

  1. 'పశుపఱుచు' రూపాంతరమే యగునేని యుద్ధమల్ల శాసన లిపిరీతిని 'పశువఱించు' అని శకటరేఫముతో నుండవలెను.