పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ix


వీరశైవము బ్రాహ్మణ్యమును, యజ్ఞయాగాదులను, కర్మలను నిరసించి నిందించుచున్నది. పాల్కుర్కి సోమనాథాది బ్రాహ్మణులు కొందఱు కులగోత్రములను విసర్జించి వీరశైవదీక్షను స్వీకరించి కృతార్ధులైరి.

మల్లికార్జునపండితారాధ్యులు మొదలగువారు వీరశైవదీక్షను బూనియును గులముతోఁ బొత్తును విడువఁజాలక, వీరశైవసంఘమునందుఁ జేరఁజాలక పోయిరి. “భక్తిమీఁదివలపు బ్రాహ్మ్యంబుతోఁ బొత్తుఁ - బాయలేను నేను బసవలింగ” యనుచు మల్లికార్జునపండితుఁ డాక్రోశమును జేయుట లింగధారణస్వీకారమును, బసవమతస్వీకారాభిలాషను సూచించుచున్నది. లింగధారణస్వీకారము కాక కేవలము శైవమతస్వీకారమునే తెలిపిన యెడలను బసవలింగనామసంస్మరణమునకును, భక్తివలపునకును నర్థము గనుపడదు. పితృమేధాదికర్మల విసర్జనమె లింగధారణమునకు నిదర్శనముగ నున్నది. ప్రస్తుతము లింగధారి బ్రాహ్మణులందు వాదప్రతివాదములకు మూలమైన ఖననసంస్కారమును లింగధారణమును సూచించుచున్నది. బసవేశ్వరుని కాలమునందును, సన్నిహితకాలమునందును శివభక్తిపరవశులై అష్టాదశకులములవారును లింగధారణను గొందఱు, వీరశైవదీక్షను గొందఱును గైకొనిరి. లింగధారణదీక్షను గైకొనిన వారియందుఁ గొందఱు సంబంధ బాంధవ్యములను విసర్జింపఁజాలక కులాచారముల నవలంబించు చుండిరి. లింగధారులయ్యును, వీరశైవాచారపరాయణులు గాని బ్రాహ్మణ వైశ్యాదులుండుట కిదియే కారణమై యుండవలయును. వీరశైవప్రతిభ తగ్గినతరువాతను బ్రాహ్మణులు, వైశ్యులు లింగధారణదీక్షను బొందుట యసంభవము. ఆంధ్రదేశమునందు లింగధారిబ్రాహ్మణులకుఁ బీఠము లేకుండుటకుఁ గారణము మతత్రయబ్రాహ్మణుల ప్రాబల్యమును, వీరశైవప్రాబల్యమును, బ్రాహ్మణలింగధారుల యప్రాబల్యమును నని యూహింపఁదగియున్నది. పండితత్రయవంశజులు (శివలెంకమంచెన పండిత, శ్రీపతి పండిత, మల్లికార్జునపండిత, వంశజులు) పీఠస్థులనియే వ్యవహరింపఁ బడుచున్నారు. లింగధారిబ్రాహ్మణులు వీరశైవనామము నెపుడు స్వీకరించినను భిన్నమతములవారును, భిన్నవర్ణములవారును వీరశైవులై, వర్ణాశ్రమధర్మములను బారఁద్రోలుటకుఁ జేసిన