పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vii


మావిడిబీజంబు మహిమీఁద విత్తఁ - గా వే మగునె పెక్కుగథలేమి చెప్పు?
సహజలింగైక్యనిష్ఠాయుక్తి భక్తి ! - బహుదేవతాసేవ బ్రాహ్మణ పథము;

     
  • * * * * *


కర్మమార్గంబగుఁగాక బ్రాహ్మ్యంబు - నిర్మలశివభక్తి నిష్ఠితంబగునె?

బ. పు.19, 21-పుటలు.

వీరశైవమునకుఁ బ్రధానదీక్ష లింగధారణము. లింగధారణమునకుఁ గక్ష, కరము, ఫాలము, కంఠము, శిరస్సు, వక్షఃస్థలము ముఖ్యస్థానములు. లింగధారులందఱును జాతిమతకులభేదములు లేని శివభక్తులు. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, మాలలు మొదలగు అష్టాదశవర్ణముల వారును వీరశైవులై కులభేదములను నిరసించినవిధమును బసవచరిత్రము విశదముచేయుచున్నది. బిజ్జలునకు బ్రాహ్మణులు బసవేశ్వరుఁడు వర్ణసంకరము చేయుచున్నవిధమును దెలిపినపుడు బసవేశ్వరుఁ డొసఁగిన ప్రత్యుత్తరము భక్తితత్త్వమును విశదము చేయుచున్నది. -

వేదంబులాదియో విధికల్పితంబు - లాదియో జాతులకది యెట్టులనినఁ
జను వేదచోదితజాతులు రెండు - వినుము ప్రవర్తకంబును నివర్తకము
భవకర్మసంస్కారి భువిఁబ్రవర్తకుఁడు - శివకర్మసంస్కారి భువి నివర్తకుఁడు
సన్నుతవేదార్థచరితంబులుండ - మొన్నఁబుట్టినకులమ్ములమాట లేల
స్రష్టుక్తమగునట్టి జాతులు గానె - యష్టాదశంబులు నవి యేల చెప్పు
మిక్కిలిపదునెనిమిదివర్ణములకు - నిక్కమారయ భక్తనిచయంబు కులము
భాగ్యహీనుండు దాఁబసిఁడిఁబట్టిన న - యోగ్యంపులోష్టమై యున్నట్లు శివుని
ప్రతిబింబమూర్తియౌ భక్తుఁడు భవికి - మతిఁజూడఁ మానవాకృతి నుండు ధరణిఁ
గావున శివభక్తగణముల మహిమ - భావింపఁదలఁప నీ ప్రాప్తియే చెపుమ.

-బ.పు, 209 పుట.

వర్తమానకాలమునందువలెనె జాతిమతకులవైషమ్యములతో నిండి నిర్వీర్యమైన సంఘమును వీరశైవము భక్తిపాశబద్ధముచేసి వీర్యవంతముచేసినవిధ మాశ్చర్యమును గలుగఁ జేయఁగలదు. వీరశైవులు లింగపసాయిత శస్త్ర