పుట:ప్రబోధచంద్రోదయము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంబెల, వి.వక్కలాకులతిత్తి సంబెళ- సంపుటము. దర్భలు మొదలగువానితో నల్లిన సజ్జ అను నరములు చూపబడినవి. (సూ.ని. 8సం 828 పుట) ఈగ్రంథమునందలి "సంబెళలోపలిదేవపూజలున్" అను ప్రయోగము చూపబడినది. (2-8) (కాశీ 1-85 వా.ని.)

సాహో. హిం అవ్య. పరివారజనముచేయు హెచ్చరిక ఈ పదము ప్రయోగించుటకు తొలి కవులు వీరే. “సాహో యని కటికవారు సందడిజడియం" (2-29) వరాహపురాణమున 'సురలు సాహొ యనగన్' (6-42) అని తరువాతి ప్రయోగములు దీని ననుసరించినవి.

సురధాణి. సురధాణ తురకదొర (హిం. సుల్తాన్) చక్రవర్తి

గజపతి సురధాణి గడిదుర్గములకెల్ల
రాజువజ్రంపు బోరుతప్ప

ప్రబోధ చం (1-19) సూ.ని. 8సం 1067పుట

బోరుతప్ప అనుట తప్పు - బోరుతల్పు అని యుండవలను.

ఇట్టితప్పు లీయెనిమిదవసంపుటమున చాల గలవు. ఈ సంపుటము పూర్తిగా సంస్కరింపదగినది

తెలుగున ప్రబోధచంద్రోదయములు

తెలుగుభాషలో ప్రబోధచంద్రోదయము మొదటిసారిగా నవతరింపజేసినవారు నందిమల్లయ ఘంటసింగయకవులే, వారి వెనుకనే తక్కిన కవులు దీని పద్య ద్విపదలో రచించిరి.

పద్యకావ్యము

కొటికెలపూడి వేంకట కృష్ణ సోమయాజి (1764-1864) ఈతడు బొబ్బిలి సంస్థానకవి నూరేండ్లు జీవించినకవి. ఈతని గ్రంథ మముద్రితము.[1]

  1. మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము కాగితపుప్రతి