పుట:ప్రబోధచంద్రోదయము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవతాళించు ఇవతాళింపుగ బౌద్ధుఁ డిట్లని పలికెన్ (3–46) ఇవతాళించు అనగా చల్లనగు శీతమగు అని యర్ధము.

దీనిని శ్రీనాథు డింతకు మున్ను ప్రయోగించినాడు, ఇవతాళించు విదర్భరాజతనయా హృద్యస్తనద్వంద్వమున్ (నైష 3-34)

ఇవతాళించు పదమునకు పైరెండు ప్రయోగములుగాక విక్ర. (4-158) లో ప్రయోగముకలదు.

ఉత్సార్యం జేసి (5–86) ఉత్సార్యము అనగా తొలగింపబడునట్లు చేయుట అని యర్థము. దీనికి నిఘంటువులలో ప్రయోగములేదు.

ఎడమపెని వెట్టు (1-81) పాడుచేయు వ్యతిరేకముచేయు పెనిమిటి ధర్మమున కెడమపుని పుట్టుదునే

ఇది నేతకు సంబంధమైనది. నేతిగాండ్రు సాధారణత్రాళ్లు కుడివైపునకు పెనవెట్టిన పేటలతో నేయుదురు. అందొకపేట ఎడమపెన పెట్టినదైనచో అది తక్కినవానితో గలియదు. నేత సరిగా జరుగదు. ఈ క్రియకు నీగ్రంథప్రయోగ మొకటియే కలదు. (సూ.ని.)

గాణు-గాడు హాని ఈపదమునకు నిర్ధారకముగా నొక్కటే ప్రయోగమిందున్నది. క. రాణించి – ప్రాణేశ్వర - జాణ - గాణు (ప్రాస) (వావిళ్లనిఘంటువు)

గ్లౌ-చంద్రుడు "గ్లౌ వంశ యనంతమంత్రి కమలజగంగా". ఇది 'గ్లౌ" అను శబ్దస్వరూపము నిర్ధారించును గ్లౌ-క- ఇది శ్రీనాథుని నుండి గ్రహించినదే.

"కంఠేకాల కిరీట విటంక గ్లౌరుచి, చుళుకితజల మణికర్ణిక" కాశీ. (6-125) చిన్నయసూరి ననుసరించి “గ్లౌ” శబ్ధమును “గ్లో" అను రూపాంతరము గలుగును.