పుట:ప్రబోధచంద్రోదయము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రై గ్లౌ శబ్దంబుల కొత్వంబు విధాషనగు తత్సమ. 64 సూ. కాని "గ్లౌ" శబ్దమునకేగాని గ్లో శబ్దమునకు నిర్ధారకప్రయోగములు లేవు.

జముకాణ (ళ)ము. జంబుకాణము జంబుఖానము

జమ్ముఖానము. వి. (హిం జమ్ ఖానా.) కూర్చుండుటకు ముతుకనూలితో నేసి క్రింద పఱచెడి ఆస్తరణవిశేషము. (సూ. ని. 3 సం. 398 పుట) సూ. ని. లో మనుచరిత్ర, చంద్రభానుచరిత్ర, ప్రబంధరాజమునుండి ప్రయోగము లీయబడియున్నవి గాని ప్రబోధచంద్రోదయ మందలి ప్రయోగమును మాత్రము వావిళ్లనిఘంటు విచ్చినది. జంబుకాణమునకు, ప్రయోగములు నవీనములే. ఇది అన్యదేశ్యము. ఈ యన్యదేశ్యము తొలుత నుపయోగించిన కవులు, ఈ కృతికర్తలే.
క.

...... ....తచ్ఛాసన
మున చేరువ జమ్ముఖానమునఁ గూర్చుండన్.

ఇది జమ్ముఖాణము - అను రూపమునకు నిర్థారకము.

జంత, వి. (క. జంతె) గయ్యాళి. సూ. ని. లో నీపదముకు సుదక్షిణాపరిణయము, ఉత్తరహరిశ్చంద్రోపాఖ్యానము నుండి ప్రయోగము లీయబడినవి. (3 సం 850 పుట). కాని యిందలిప్రయోగమే మొదటిది. "ఏజంత బోధించినే" 3-3.

తలనొప్పి వి 1. శిరోవేదన తలనొచ్చుట; 8. తలనొప్పి సూ.ని. (3సం 728పుట) ఇందు 17వ శతాబ్దినాటి శుకసప్తతినుండి మాత్రమే ఈ పదమునకు ప్రయోగ మీయబడిది. కాని తొలిప్రయోగ మీపదమునకు నిందేకలదు. "తలనొ ప్పేమియు జెందకే హృదయసంతాపంబునుం జెందకే” (4-23)

తామ్రంపుగిండి రాగిపాత్ర తామ్రంపుగిండి నంబువులిడ (2-14)

ఇది నిఘంటువుల కెక్కలేదు.

నిబద్ధి సత్యము “ఇది నిబద్ధి తప్పదు మీపాదమాన" (2-53)