పుట:ప్రబోధచంద్రోదయము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అహంబ్రహ్మీభవించు: సం. అ. క్రీ. అహంబ్రహ్మ అనుకొనువాడగు, నేనే బ్రహ్మ మని యనుకొను "అహం బ్రహ్మీభవించి తల్లికిం దగినబిడ్డ కలిగెనన మెలంగుచుండు" (1-76) చల్లాసూరయకవి దీనిని తన వివేకవిజయమున ప్రయోగించెను. (పుట 88) (సూ.ని.)

ఆగ్రహముచేయు సం. స.క్రి - కోపముచేయు సూ.ని.లో ఆగ్రహము సం.వి. అ.పు. 7వ యర్థము కోపము ఈ యర్థము తెనుగు గ్రంథములయందును వాడుకలోను గాన్పించుచున్నది.

"ఆగ్రహ మాత్మలోఁ బొడము నట్లుగ" వి.పు. 1.13 (పుట390. ఇచ్చట ఆగ్రహము విశేషముగా నున్నది. గాని క్రియగా లేదు)ఆగ్రహము చేయు

“చెఱచెదనంచు నాగ్రహము చేయుగాని" (5-51) అని యందు ప్రయోగముకలదు. ఇది నిఘంటువుల కెక్కలేదు.

ఆశుకవిత్వము సూ.ని.లో "ఆశుకవి " పదమున్నదిగాని ఆశుకవిత్వము లేదు. శబ్దరత్నాకరానుబంధమున (పుట 11) నేను చేర్చితిని. అశ్రుతవ్యాఖ్యాన మాశుకవిత్వంబు 5-56.

ఆలు ప్రత్యయ ప్రయోగములు

కులస్థురాలు- అభాసురాలు 8-95
జోగురాలు 3-49
భావకురాలు 5-57
వృథారంజకురాలు 1-73
సేవకురాలు- 2-54
విహ్వలురాలు 3-74

పైవానిలో 'జోగురాలు' ఆను పదమునకు మాత్రమే నిఘంటువులలో ప్రయోగము గలదు. తక్కినవానికి లేవు. జోగురాలి శబ్దమును మొదట ప్రయోగించిన దీకవులే.