పుట:ప్రబోధచంద్రోదయము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అహింసాపరమోధర్మ 8-40
ఉష్ణ ముష్ణేన శామ్యతి 5-12

విశిష్టపదములు - అర్థములు

అనుభోగించు. సం స క్రి అనుభవించు

తనువునకు నాత్మ వేఱఁట
యనుభోగించు నట పిదప
నాముష్మికమున్

(2-31)

ఈ పదమున కిది యొక్కటే ప్రయోగము (సూ.ని)[1]

అనూనయించు. సం.స.క్రి (ఇందలి యడాగమము విచార్యము) అనూనినుగాఁ జేయు, గౌరవించు, పూజించు

"ఉపనిషద్దేవిని ననూనయించి తోకొంచు రండని పలికి (1-84)

ఈ పదమునకు మొదటి ప్రయోగ మిది. సూ.ని.లో, రంగారాయచరిత్ర, "అని యనూనయించుచు", (1-15-16) అనియు “ధాత ననూనయించి" సేతు ఖండము (1-41) అను రెండు ప్రయోగములు గలవు. కాని ఈ రెండు ప్రయోగలు అర్వాచీనములు.

అవధాని సం. విణ న్.నీ న్ అవధానము కలవాఁడు (సూ.ని. సం.1 325 పుట)

దీనికి ప్రయోగము చూపబడలేదు. అర్థము సరిగాలేదు. అవధాని శబ్దమునకు రెండర్థములు. ఒకటి వేదములు చదువువాడు "అర్థంబు తెలియక యఱచెద రవధాను లూరక వేదాలు నోరికొలది." (2-7) అని యిందు ప్రయోగము. రెండు అష్టావధాని — అష్టావధానము చేయువాడు, శతావధాని — సాహిత్యమున శతావధానము చేయువాడు అనియు వాడుకలో నున్నవి.

  1. సూ.ని. సూర్యరాయాంధ్రనిఘంటువు మొదటి సంపుటము.