పుట:ప్రబోధచంద్రోదయము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామెతలు

గుడి మ్రింగేవానికి తలుపు లప్పడములు (2-65)
రెంటికిం జెడిన రేవడు (3-24)
వెనకయ్య చేతికి వెసల యిచ్చిన విధమున (4-29)

వైవానిలో వెనకయ్య చేతికి వెసలు యిచ్చిన విధమున అనుదాని యర్థము సరిగా నింతవఱకు వివరింపబడలేదు సూ.ని.లో వెసలు క్రింద యిది చూపబడి "తాను చెడి యితరునిగూడ చెఱచుట" అను నర్థమీయబడియున్నది. (సం. 7 పుట 851)

ఈ సామెతను నాచన సోము డుత్తరహరివంశమున ప్రయోగించినాడు (3-50) సూ.ని. దీనిని యుదాహరించినది. దీనియర్థ మిది "ఇచట వెనకయ్య అనగా మన విఘ్నేశ్వరుడుగాడు. వినాయక శబ్దభవము వెనకయ్య ఈవినాయక శబ్దము గణపతినేగాక, బుద్ధుని బోధించును" బుద్ధో వినాయకః అని అమరము.

బౌద్ధబిక్షుకులు వారికి వెసలు వంటపాత్రలతో ప్రమేయములేదు. కోమటి బౌద్ధునికి వంటపాత్ర లిచ్చి తాను చెడుటయేగాక ఇతరకోమట్లను చెఱుచును. అందువలననే సూ.ని. యం దిచ్చిన యర్ధము సరియైనది. ఇది బౌద్ధమతసంబంధమైన సామెత యని గ్రహింపవలెను. [1]

సంస్కృత సూక్తులు

ఇందు పైసూక్తులు రెండు మాత్రమే గలవు.

"స్త్రీముఖం సదాశుచిః" 2-55

స్త్రీ ముఖం సదాశుచి యన్న సూక్తికి తెలుగున నీక్రింది పద్యము వాడుకలో నున్నది.

క.

జిగిగల పడతుల మోవికి
యగణితముగ నీళ్ళబావి కమృతంబునకున్
తగ నుచ్చిష్టము లేదని
ఖగవాహనుతోడ గరళకంఠుఁడు పలికెన్.

  1. చూ. హంసడిభకోపాఖ్యానము నావ్యాఖ్య పుట 109