పుట:ప్రబోధచంద్రోదయము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4) ప్రభునామయతి

సీ.పా.

 సింగమంత్రికి పుణ్యశీలయౌ పోచమ్మ
కాత్మసంభవుఁడు మల్లయమనీషి

(1-24) (పుట 357)

ప్రాసలు

ఖండాఖండప్రాస క. గాటపు సంసారాంబుధి, దాఁట (5-62) గీతము (5-57)లో ప్రాస పాటింపబడినది.

స్వమరు, సమయ- భ్రమర - సమర

వృత్తములు

1. హరిణీవృత్తము (1-71)

2. పృథ్వీవృత్తము (8-86)

నన్నయలో పృథ్వీవృత్తమునకు 9వయక్షరము యతి. అదే యీ కవులును పాటించిరి.

"ప్రధాన కులభూషణా ప్రధితజగన్నిమేషణా" పెద్దనాదులు 14వ యక్షరముపై యతి పాటించిరి.

3. దండకము మూలమున నిది దండకమే

“జయజయ వినయానతేంద్రాది బృందాకరకశ్రేణి చూడామణీ రాజితోపాంత పాదద్వయాంభోజ” (4-46)

"విద్వాంసులెల్లన్ హకారంబెకానీ, నకారంబెగానీ, సకారంబెకాని వచింపదగున్" అని అప్పకవీయమున దండకలక్షణము (4-253)

పైదండకము సకారముతో ప్రారంభమగుచున్నది. అప్పకవి ననుసరించి నమస్తే నమస్తే నమః. అని దండకము చివర నుండవలెను. కాని యిం దట్లు