పుట:ప్రబోధచంద్రోదయము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేదు. "భక్తిన్ పునర్నమ్రుఁడై " అని మాత్రమే గలదు. ఇది 5 మాత్రలుగల ఖండగతిని నడచును.

వినయాన - 5 లఘువులు లేక మాత్రలు
తేంద్రాది -
బృందార -

ఇట్లే దండకమున ప్రయుక్తమైనవి కావున నిది ఖండగతి నడచు దండకము.

దండకములకు రగడవలె గతి భేదములున్నవి. నన్నయ భారతమున తొలిదండకమున “శ్రీకంఠ - లోకేశ - లోకోద్భ -వస్థాన సంహార - కారీము" అని తకారముతో ప్రారంభము. ఇదియు ఖండగతినే నడచును.

శ్రీకంఠ 5 లఘువులు లేక మాత్రలు

పైరీతిగా దండకములను తాళప్రధానములుగా పరిశీలింపవలసిన ఆవశ్యకత యున్నది.

4. ఉత్సాహవృత్త మిందు ఆశ్వాసాంతమున నున్నది. ఆశ్వాసాంతపద్యములలో ఉత్సాహవృత్తము వాడరు. ఈ కవులు మాత్రము వాడినారు.

5. భుజంగప్రయాతము (4-72.) భుజంగప్రయాత మిందు ఆశ్వాసాంతమున నున్నది. ఇదియు నాశ్వాసాంతముల వాడుకలేదు. పైదానివలెనే క్రొత్తవాడుక.

6. మణిగణనికరము ఈవృత్తము నన్నెచోడాది ప్రాచీనకవులు వాడిరి.

ఇది 15వది యగు ఆతిశక్వరీ ఛందస్సున బుట్టినది.

అనవుడు మనసును నతిముదమున న
వ్వనరుహభవనుని వనజవదనా
తనయుని పలుకు లితరమరయఁగ నా
మనసునఁ గలిగిన మమతయుఁ దొలఁగెన్

(5-40)