పుట:ప్రబోధచంద్రోదయము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుకవిమనోరంజనము[1]

1) అఖండవడి—

శ్రీనిత్యంబుగ నుండు గావుత.....................................
......................................................................భో
ధాసందైకమయుండు శంకరుఁ డనంతస్వామి గంగయ్యకున్ (పుట100)

(1-1)

2) అభేదవడి - దడలకు

నావుడుఁ దద్ద్విజుం డహహ నాదగు శీలము వర్తనంబునున్
భావనముం గులంబునను బాగగువిత్తలు గౌడదేశరా
ధావరపట్టణంబునఁ గడాని మదీయగృహంబు తండ్రి ధా
త్రీవినుతుండు తత్సుతులు శ్రేష్ఠులు నే నధికుండ వారిలోన్.

(2-12)
రాధావరపట్టణంబునఁ గడాని — ముద్రితపాఠము (పుట 152)

3) ప్లుతయతి అచ్చునకు

సీ.

ఏజెంత బోధించెనే తల్లి
ఏబొడ్డి బోధించెనే యింత
ఏరండ యెడబాపెనే తల్లి
ఏలంజె భ్రమియించెనే తల్లి (పుట 265)

(3-3)
  1. ఈ లక్షణగ్రంథము నూరేండ్లక్రిందట కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని కైదవతరమువాడైన కూచిమంచి వెంకటరాయకవిచే రచితము. ఇందు ప్రబోధచంద్రోదయమునుండి నాలుగు పద్యము లుదాహరింపబడినవి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారిచే నూతనముగా ప్రకటితము (1976) పరిష్కరణ - కోవెల సంపత్కుమారాచార్య.