లయగ్రాహి. | నందకధరున్ ఘనపురందరమణిప్రతిము నిందిరమనోహరు ముకుందు హరిఁ గానీ | (5-33) |
మూలములో "హరి" కృష్ణుని స్తుతి మాత్రమే యున్నది. కృష్ణమిశ్రుడు వైష్ణవమతస్థుడుగాన శ్రీకృష్ణుని మాత్రమే పేర్కొన్నాడు. తెలుగున నంది మల్లయ ఘంటసింగయలు శైవు లగుటచే హరికృష్ణునితో సమానముగా హరుని శివుని గూడ పేర్కొన్నారు.
| విష్ణు ప్రశంస మాతృకానుసారము | |
ఇచట నింకొకవిశేష మున్నది. అనువాదకులు పెద్దవృత్తమగు లయగ్రాహిని గ్రహించినారు. ఆ వృత్తము పూర్తియగుటకు క్రొత్తకల్పన యవసరము. అందుచే శివుని గూడ జేర్చినారు.
హరిహరు లొక్కరేయని హరివంశప్రతిపాదన గావున నీ కల్పనయెంతియు నౌచితీసంపాదనమై యున్నది.
మూలశ్లోకభావవిస్తరణ
శ్లో. | సమ్మోహయంతి మదయంతి విడంబయంతి | (1-22) |