| సహజవక్రంబుగాన సజ్జనులమేలు | (2-11) |
పైపద్యమున మొదటిపాదము “చాపచుట్టగఁ జుట్టి చంకఁ బెట్టుకపోడె ధరణి హిరణ్యాక్ష దానవుండు" అనునది అమూలకము. నీ పద్యము నాలుగుపాదములు పూర్తికావలెను. మూలమున మూడు దృష్టాంతములు మాత్రమే యున్నవి. అందుకొరకు నాల్గవది చేర్చినారు. ఈ కథ వరాహపురాణములోనిది.
వ. | మహామోహాః భోఅసత్సంగ ఆదిశ్యంతాంకామ క్రోధ లోభ మదమాన | (2-26) |
యోగిని యగు విష్ణుభక్తిని సంహరించుటకు ప్రయత్నములు సల్పుమని మహామోహుడు కామక్రోధాదుల కసత్సంగునిద్వారా వర్తమాన మంపినట్లు మూలములో నున్నది.
తెలుగున కామక్రోధాదు లెదుట నున్నట్లును వారితోనే మహామోహు డీవార్త చెప్పినట్లున్నది.
మ. | పడతీ! దల్లిని దండ్రిఁ జంపుట తృణప్రాయంబు తోఁబుట్టులన్ | (2-67) |
ఇందు మూలములో లేని లోకోక్తి యొకటి చేర్చబడినది.
శ్లో. | నిత్యంస్మరన్ జలదనీలము దారహార | (4-28) |