పుట:ప్రబోధచంద్రోదయము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3) మూలము నాటకముగాన నందు వర్ణనలు లేవు. తెలుగున నిది ప్రబంధము గావునను, ప్రబంధమునకు వర్ణనలు నియతమగుట చేతను నీకవులు వర్ణనలను ప్రవేశపెట్టవలసివచ్చినది. కావ్యప్రారంభమున పురవర్ణన యుండవలెను గాన చిదానందనగరిని కల్పించి మహామోహునకు వివేకునకు యుద్ధము మొదలగుటకు పూర్వము సాయంకాలవర్ణన కల్పితమైనది. ఇది మూలమున లేదు.

మూలములో సంభాషణలు వచనముగా నుండగా నిది శ్రవ్యకావ్యము గావున పద్యములతో నున్నది.[1]

4) మూలమున నారు అంకములు గలవు. కాని తెలుగున అయిదాశ్వాసములు గలవు.

ప్రథమాంకము ప్రథమాశ్వాసము
ద్వితీయాంకము ద్వితీయాశ్వాసము
తృతీయాంకము తృతీయాశ్వాసము
చతుర్థాంకము
పంచమాంకము చతుర్థాశ్వాసము
షష్ఠాంకము పంచమాశ్వాసము

మూలమునగల 4,5,6 అంకములు తెలుగున 4,5 ఆశ్వాసములలో సంగ్రహింపబడినది. అనగా కథాక్రమము సక్రమముగానున్నది. మూలమువలె ఆరు

  1. పద్యకావ్యములలో నొక్క సముఖము వేంకట కృష్ణప్పనాయని రాధికాసాంత్వనమున నాటకమునందువలె పద్యములలోనే సంభాషణగలదు.