పుట:ప్రబోధచంద్రోదయము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షుని వశీకరించుటకు మధుమతియను మోహుని స్త్రీని బంప యామె తన యింద్రజాలవిద్య చూపి నానావిధములగు నింద్రియసుఖభోగములను గల్పించి యాతని పరిభ్రమింపజేసి తనవలలో వేసికొన్నది. అని శ్రద్ధ తిరిగి చెప్పగానే శాంతి విషణ్ణచిత్తయై, ఇంతశ్రమ పడినను తుదకు ఫలము గలుగలేదని దుఃఖించి, ఈ పరిణామమునకు ప్రతీకారవిధాన మెద్దియేని కలదో యని యడిగెను.

అంత శ్రద్ధాదేవి శోకించుచున్న తనపుత్రికను సమాశ్వాసించి తనయా! ఊరడిల్లు మూరడిల్లుము తర్కమునీశ్వరుడు జీవేశ్వరుని వద్దకుపోయి "ఈశ్వరా ఇట్లేల సంసారవిభాంతిజ్వాలల జిక్కుకొన్నావు" అని యడుగగా జీవేశ్వరు డదిరిపడి "తర్కా! మేలుమేలు నేనెంత మూఢుడనైతిని నన్ను మేలుకొలుపితివి. మేలుచేసితివి" అని మెచ్చుకొనుచు మధుమతిని చాల ధిక్కరించెను. కావున మనకు నిశ్శంకముగ నానందదాయకములగు వైభవోత్సవములే కలుగుచున్నవి అని శ్రద్ధ చెప్పి తాను వివేకుని జీవేశ్వరుని కడకు దెచ్చుటకు పోవుచున్నానని తెలిపెను. అంత శాంతి తానుగూడ నుపనిషద్దేవిని వివేకునికడకు తోడి తెచ్చుటకు బోవుచున్నానని తల్లితో నుగ్గడించి తనదారిని బోయెను అంత జీవేశ్వరుడు విష్ణుభక్తిదేవిమహిమకు గడు సంతసించి తాను కష్టముల నన్నింటిని నతిక్రమించి నిత్యనిర్మలసుఖములను బొందగలుగుట యాదేవి కృపాకటాక్షముననే యని వాక్రుచ్చి సంతోషించు సమయమున వివేకమహారాజు శ్రద్ధాంగనాసమేతుడై జీవేశ్వరునిసన్నిధి కేతెంచెను.

(6)

వివేకమహారాజు జీవేశ్వరునికి మ్రొక్కి దీవనెలు పొంది ప్రస్తుతించు సమయమున ఉపనిషద్దేవి శాంతిలలను దోడ్కొని వివేకమహారాజు సమక్షమునకు చనెను. అంత జీవేశ్వరు డుపనిషత్తరుణిని సంభావింప, ఆమె వివేకున కభివందనములాచరించి యుపాంతస్థలమున నధిష్ఠించెను జీవేశ్వరు డుపనిషదాంగనతో భామా! నీవు భర్తవలన నెడబాటు నొంది పెక్కుకడగండ్లుండి కాలము గడపుచుంటివని మేమెఱుగుదము ఎచ్చటెచ్చట నేవిధమునైన బాధల బొందితివో మాకు నెఱుగజెప్పుమనిన యామె యిట్లనియే "కృష్ణాజినాజ్య సమిధాసుధాది గృహీత హస్తయజ్ఞ విద్యాదేవి నన్ను నొల్లక నాతో బురుడించి వేరుచోటికి న న్నరుగుమని వెళ్ల