పుట:ప్రబోధచంద్రోదయము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనస్సునకు వైరాగ్యము కలుగునట్లుగా నుపదేశము చేయుమని నియమించెను. వ్యాససరస్వతియు నట్లే మనస్సునకు ననేకవిధముల బోధించి భావము లనిత్యము లనియు, పాంచభౌతికమగు శరీరములు నశ్వరము లనియు బ్రహ్మమే సత్య మనియు ఇత్యాది వేదాంతవిషయములను చక్కగా తెలియజెప్పి విచార ముడుగుమని యుపదేశించెను కాని యామె యెంత జెప్పినను మనస్సునకు దుఃఖ ముపశమింపలేదు. వేదాంతసరస్వతి మాత్రము విసుగుజెందక సకలలోకరక్షణదక్షుడగు నిందిరాధవునిగాని ఇందుధరునిగాని పొందగలనాయని తలంచి యుండుమనియు, మోహపాశబంధములు తమంతటతామే సడలిపోవుననియు చెప్పిన మనస్సు ఊరడిల్లి కృతార్థుడ నైతినని వ్యాససరస్వతీదేవి పాదముల కెరగిన యామె మనస్సును జూచి వత్సా! నీహృదయం బుపదేశక్షమం బయ్యెనుగాని మఱియొకరహస్యము జెప్పేదనని, "జడున కసారసంసారవిభ్రాంతి గలుగునుగాని వివేకవంతునకు గలుగదు. వివేకున కిదియంతయు విరక్తి కారణంబే” యని వేదాంతపరమరహస్యమును దెలిపెను. ఇంతలో వైరాగ్యుడు రాగా భారతీదేవి మనస్సుతో “వత్సా! నీతనయుడు వైరాగ్యుడు వచ్చినాడు వానిని సంభావింపుము" అని కోరెను అప్పుడు మనస్సు వైరాగ్యుని కౌగలించుకొనెను. అంత సరస్వతీదేవి మనస్సుతో నిట్లనెను.

ప్రథమభార్యయగు ప్రవృత్తిదేవి పుత్రశోకమువలన మరణించినది. కావున విచారింపక రెండవపత్నియగు నివృత్తిదేవిని రావించి కూడియుండ వలసిన దానియు తత్సంజనితులగు వివేకాదులను యౌవరాజు స్థాపితులు జేసి సామ్రాజ్యము వహింపుమనియు నుపదేశించి దీవించి, శ్రద్ధను జీవమహారాజు నొద్దకు బోయి చేయవలసిన కార్యముల ననుసంధింపు మనియె శాంతిని వివేకమహారాజుకడకేగి యూడిగంబులు సలుపుమనియు చెప్పి మిగిలిన కార్యములను సంఘటించుటకు దాను వెడలిపోయెను.

వివేకమహారాజు శాంతితో తన ప్రేయసియగు నుపనిషద్దేవిని తోడి తెమ్మని చెప్పిపంపెను. ఆమె యట్లు పోవుచుండగా దారిలో తల్లియగు శ్రద్ధను గాంచి యానందభరితురాలై ఆమె యెచ్చటికి ససంభ్రమముగా బోవుచున్నదని ప్రశ్నించెను. ఆమె జీవేశ్వరుడు నిష్కంటకముగా సామ్రాజ్య మేలుచుండగా విచారమునకు హేతు వేమి యాని మారుపల్కె మహామోహుడట్లు యుద్ధమున నిర్ణీతుండై నీను జీవపురు