పుట:ప్రబోధచంద్రోదయము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేవ చేయుమని వినియోగించెడు. ఆ వచ్చిన స్త్రీని శాంతిచూచి తన తల్లియని భ్రమించెను. కాని మరికొంతసేపటి కామె తనతల్లి కాదని, “తామసి" అనునది యని నిశ్చయించుకొనేను.

తరువాత బౌద్ధమందిరములనైన తనతల్లి యుండునేమో యని వెదకుటకు తిరుగుచుండగా నంతలో బౌద్ధభిక్షు డొకడు చేత పుస్తకములను పట్టుకొని యెదురు పడెను. ఆతని యొద్దను తామసియే యున్నది గాని తన తల్లి శ్రద్ధ లేదని యామె గ్రహించెను.

ఇట్లుండ దిగంబరుడైన క్షపణకుడు బౌద్ధభిక్షువుతో మతవిషయమున వాదములాడ మొదలిడ తుదకు వాని దూషింపసాగెను. వీరిద్దరు కలహమాడుచుండగా సోమసిద్ధాంతు డొకడు చేత కత్తిని పట్టుకొని యచ్చటికి వచ్చెను. వీరు మువ్వురు మతాభినివేశమువలన తమతమ మతములను గూర్చి చర్చింపసాగిరి. కొంతవడికి కాపాలికుడు రోషకషాయితాక్షుడై, క్షపణకుని బొడుచుటకు చేయి సాచెరు అంత బౌద్ధుడును క్షపణకుడును బెగడుపడి ఆసోమసిద్ధాంతిని క్షమాపణ వేడిరి. అంత సోమసిద్ధాంతి తాను గ్రోలుచున్న మదిరామదమును కొంత వారి కిచ్చి వారిని తన మతమున చేర్చుకొనెను. వారు మువ్వురును నట్లు సఖ్యపడి "అద్దిరా! మన చక్రవర్తి మహామోహుని యాజ్ఞను మరచి మన మిచ్చోట కాలవిలంబనము చేయుచున్నాము. శ్రద్ధాదేవిని బట్టితెమ్మని మనఱేని యానతిగదా! ఆమె విష్ణుభక్తి చెంతను దాగియున్నది. కాబట్టి ఆమెను వెంటనే కొనితేవలయును అని కాపాలికుడు తన భైరవీశక్తి నాకర్షించి పంపెను. ఇంతలో శాంతియు కరుణయు శ్రద్ధయొద్ద కేగిరి. వీరిట్లుండగా శాద్రరసావిష్ట యగుభైరవీశక్తి భీకరాకారముతో గగనమున కెగసి పావురమును డేగ పట్టుకొనునట్లు శ్రద్ధాలలమ బట్టికొని యెగిరి వచ్చుచుండగా విష్ణుభక్తి యడ్డుపడి భైరవిని పారద్రోలి శ్రద్ధను విడిపించెను.

(4)

విష్ణుభక్తిమహాదేవి శ్రద్ధను విడిపించి యామెతో నిట్లు నుడివెను. శ్రద్ధా! నీవు వేవేగమే పోయి వివేకమహారాజుతో నిట్లు చెప్పవలెను. “మోహాదివర్గ