పుట:ప్రబోధచంద్రోదయము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రములు

క్షేత్రములు మతసంబంధమైనవి. అందువలన నీ నాటకమున రెండుక్షేత్రములు వర్ణితము లైనవి.

వారణాసీక్షేతము

ఇది భారతదేశమున ఆద్వైతులకేగాక స్మార్తులందరికి సేవ్యమానమైన దివ్యక్షేత్రము. ఈకాశీక్షేత్రమహిమను శ్రీనాథుడు కాశీఖండమున నీకవులకుముందే చాటినాడు. ముఖ్యముగా యతీశ్వరుల కిది స్థానము. నాటకకర్త కృష్ణమిశ్రుడు యతీశ్వరుడు గావున వారణాసీక్షేత్రమును నాటకమున ప్రస్తావించినాడు.

పురుషోత్తమక్షేత్రము

ఇది వైష్ణవక్షేత్రము. ఉత్కళదేశము(ఒరిస్సా) లో నున్నది. ప్రబోధచంద్రోదయమున దీని ప్రసక్తి గలుగుటకు ఇందు విష్ణుభక్తి యోగినిగా ప్రవేశపెట్టబడుటయే హేతువు.

ఈ కవులకుముందు, ఎఱ్ఱనయు, శ్రీనాథుడును నీపురుషోత్తమక్షేత్రము (నేడు పూరీజగన్నాథక్షేత్రము)ను తమకృతులలో నృసింహపురాణ భీమఖండములలో ప్రశంసించిరి.

కథాసంగ్రహము

జ్యోతిర్మయంపుకోటలును అమృతంపుబరిఖలును నైర్మల్యంపుమేడలును గల చిదానందనగరియందు ఈశ్వరుడను రాజు రాజ్యపాలనము చేయుచుండెను. అతనికి మాయ యనెడి పట్టమహిషి వలన మనస్సు అనెడి తనయుడు గలిగెను. ఆ రాజకుమారునకు ప్రవృత్తి యనియు, నివృత్తి యనియు నిద్దరుభార్యలు గలరు. ప్రవృత్తిదేవి వలన మహామోహుడు మున్నగు సుతులును, నివృత్తిదేవివలన వివేకుడను పుత్రులును జనించిరి.

ఈ ఇరువురు సపత్నుల పుత్రులయందును సమానమగు రాజ్యకాంక్ష యుద్భవించినకతన కౌరవపాండవులకు రాజ్యవిషయమున పోరు కల్గినట్లు ఈ