పుట:ప్రబోధచంద్రోదయము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములు విడిచినాడు. అప్పటి కాతనికి తెలిసిన గంగయవంశవివరములు మాత్రమే వ్రాసియుండును, ప్రబోధచంద్రోదయకర్తలు మరికొన్ని యంశములు హెచ్చుగా తెలిసికొని గ్రంథస్థము చేసిరి.

మంత్రిత్వము గంగనప్రతిభ

గంగమంత్రి పూసపాటి మాధవవర్మ సంతతివాడైన బసవభూపాలుని మంత్రి. ఈతడు గజపతిరాజులకు సామంతుడు. గజపతిరాజు కపిలేంద్ర గజపతి. క్రీ.శ. 1460 ప్రాంతమున కపిలేంద్రగజపతి ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసికొని బసవరాజు తండ్రియైన తమ్మభూపాలుని అధిపతిగ నియమించెను. తమ్మభూపాలుని తరువాత కుమారుడు బసవరాజు క్రీ.శ. 1471 లో ఉదయగిరి రాజ్యమున కధీశు డయ్యెను[1]. ఆప్పుడు కపిలేంద్రగజపతి కుమారుడు పురుషోత్తమ గజపతి రాజుగానుండెను.

గంగమంత్రి నీతియుగంధరుడుగా పేర్కొనబడినాడు.

క.

“నీతియుగంధర సుకవి
వ్రాతప్రస్తుతయశోధురంధర

(2-80)

ఇచట నీతి యనగా రాజనీతి. యుగంధరుడు ప్రాచీనమంత్రులలో ప్రసిద్ధుడు. గంగమంత్రి రాజనీతి విశారదత్వమును వెల్లడించు నొకసన్నివేశ మీగ్రంథముననే కలదు.

"శ్రీకర వీక్షణదాన
శ్రీకర నరసింహనృపవశీకర నయవి
ద్యాకరణ”

(2-1)
  1. ఈ వివరములకు పూర్వోక్తగ్రంథవ్యాసము చూడుడు. అనంతామాత్యుని గంగయ. పుటలు 210-211