పుట:ప్రబోధచంద్రోదయము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందును వంశవృక్ష మీయబడినది. రెండు గ్రంథములయందును వంశవృక్షములు నొకటియేగావున ప్రత్యేకముగా నుదాహరింపలేదు.

గ్రామనామము

తెలుగులో చాలమంది ఇంటిపేర్లవలె పెసరవాయ గ్రామనామమే. కాని యీ గ్రామ మెచ్చటనున్నదో ఎవ్వరు నిర్ణయించి తెలుపలేదు. ఈ పెసరవాయ యెచ్చటిదోయని కీ శే చాగంటిశేషయ్యగారు వ్రాసిరి. ఈ గ్రామము కాకతి ప్రతాపరుద్రునికాలమున క్రీ శ 1299 అలంపురం బ్రహ్మేశ్వరాలయమందలి యొక శాసనములో పేర్కొనబడినది (తెలంగాణాశాసనములు రెండవసంపుటము కాకతీయ శాసనములు) అలంపురం మహబూబునగర మండలమున నున్నది. పెసరవాయ అజిల్లాలోనే యుండియుండవచ్చును.[1]

పెసరవాయగంగమంత్రి అత్తవారును పెసరువాయాన్వయులే. గంగన అత్తవారుసు పెసరువాయాన్వయులే యని తెల్పుటకు దుర్గాభైరవరాజు వంశములోని లక్కసానమ్మభర్త ఆదిరాజు క్రీ శ. 1489 లో తిరుపతిలో ఒక శాసనము వేయించెమ. (నెం. 52 తి.తి.దే. సాళువనరసింహునికాలపు శాసనములు) అందు లక్క సానమ్మ పెసరువాయాన్వయమునకు సంబంధించినదని తెలుపబడియున్నది.

దుగ్గన నాచికేతూపాఖ్యానమున గంగమంత్రి చెందలూరి గంగమంత్రిగా పేర్కొనబడినాడు “చెందలూరిగ్రామము ఒంగోలు తాలూకాలో కడపకుదురు రైల్వేస్టేషనుకు 18 మైళ్ల దూరమున నున్నది"[2]. గంగమంత్రి యిచ్చట చాలకాలము నివసించియుండవచ్చును. నాసికేతూపాఖ్యానకాలమున చెందలూరిలో నివసించి యుండవచ్చును. కావున తత్కర్త యట్లువ్రాయుట తటస్థించినది. ఆదిగాక దుగ్గన అనంతామాత్యుని గంగయవంశము వర్ణించినను కొన్ని వివర

  1. అనంతామాత్యునిగంగయ - నిడుదవోలు శివసుందరేశ్వరరావు ఆంధ్రదేశచరిత్ర
    భూగోళసర్వస్వము మొదటిసంపుటము- పుట209 212

  2. అనంతామాత్యునిగంగయ - నిడుదవోలు శివసుందరేశ్వరరావు ఆంధ్రదేశచరిత్ర
    భూగోళసర్వస్వము మొదటిసంపుటము- పుట209 212