పుట:ప్రబోధచంద్రోదయము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంటిపేరు పెసరవాయవారని చెప్పవచ్చును. ఈ గ్రంథమున నిచ్చిన యాతని వంశవృక్షము

పెసరవాయవారి వంశము[1]

శ్రీనాథుని బావమరదియగు దగ్గుపల్లి దుగ్గన కృతమైన నాచికేతోపాఖ్యానమును గంగమంత్రి కృతినందినట్లుగా నీగ్రంథమున నిట్లుగలదు.

ప్రఖ్యాత నాచికేతూ
పాఖ్యాన మహాప్రబంధపరిమళితసుధీ
వ్యాఖ్యానశ్రవణోదిత
సౌఖ్యాసంఘటిత చిత్తశంకరసఖ్యా!

(4-72)
  1. దేవమ్మ, దుగ్గమ్మ ఈ రెండు పేర్లును గంగమంత్రి కృతినందిన నాసికేతూపాఖ్యానమునుండి గ్రహింపబడినవి.